`ప్రాజెక్ట్ కే`కి దేశమే కాదు, ప్రపంచం సైతం చప్పట్లు కొడుతుంది.. కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Published : Jun 25, 2023, 02:18 PM IST
`ప్రాజెక్ట్ కే`కి దేశమే కాదు, ప్రపంచం సైతం చప్పట్లు కొడుతుంది.. కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

సారాంశం

 `ప్రాజెక్ట్ కే`లో కమల్‌ నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై కమల్‌ స్పందించారు. `ప్రాజెక్ట్ కే`లో తాను భాగం కావడంపై ఆయన రియాక్ట్ అవుతూ, దేశం గర్వించే చిత్రమవుతుందన్నారు.

`ప్రాజెక్ట్ కే`తో సంచలనాలకు తెరలేపారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. వారి పాత్రలు సరికొత్తగా ఉండబోతున్నాయట. ఇప్పటికే వారి ప్రీ లుక్‌లను విడుదల చేశారు. తాజాగా లోక నాయకుడు కమల్‌ హాసన్‌ని కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారు. కమల్‌ భాగం కావడంతో ఈ సినిమా రేంజ్‌ నెక్ట్స్ లెవల్‌కి చేరింది. ప్రభాస్‌ కంటే ముందే.. పాన్‌ ఇడియా రేంజ్‌ మార్కెట్‌ ఉన్న నటుడు కమల్‌. ఆయన ప్రతి సినిమా తమిళంతోపాటు తెలుగు, హిందీలో విడుదలవుతుంటాయి. పైగా హిందీలోనూ అనేక సినిమాలు చేశారు. 

ఈ నేపథ్యంలో `ప్రాజెక్ట్ కే`లో కమల్‌ నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై కమల్‌ స్పందించారు. `ప్రాజెక్ట్ కే`లో తాను భాగం కావడంపై ఆయన రియాక్ట్ అవుతూ, యాభై ఏళ్ల క్రితం నేను డాన్సు అసిస్టెంట్ గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్‌ పేరు పెద్దగా వినిపించేది. 50ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మన తర్వాత తరం నుంచి ఒక బ్రిలియంట్‌ డైరెక్టర్‌ ఈ సినిమాని తీస్తున్నారు. నా సహ నటులు, ప్రభాస్‌, దీపికా పదుకొనె కూడా ఈ తరం వారే. నేను ఇంతకు ముందే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేశాను. అయినా ప్రతిసారి మొదటిసారి అనిపిస్తుంటుంది.  

అమితాబ్‌ బచ్చన్‌ జీ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు, నేను కూడా ఆ ఆవిష్కరణ ప్రక్రియను అనుకరిస్తున్నా. నేను `ప్రాజెక్ట్ కే` కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రేక్షకులు నన్ను ఏ స్థానంలో ఉంచినా నా ప్రాథమిక నాణ్యత ఏంటంటే నేను సినిమా అభిమానిని, నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నమైనా ఆ నాణ్యత మెచ్చుకుంటూనే ఉంటుంది. `ప్రాజెక్ట్ కే` కి నాదే మొదటి అభినందనలు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజన్‌ కి మనం దేశం, సినిమా ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుందని కచ్చితంగా చెప్పగలను` అని పేర్కొన్నారు కమల్‌. ఈ సందర్భంగా బిగ్‌ బీ అమితాబ్‌ స్పందిస్తూ, కమల్‌ కి స్వాగతం పలికారు. మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తికరంగా ఉన్నట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా ప్రభాస్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం అంటూ ఆయన ఎమోషనల్‌ వర్డ్స్ షేర్‌ చేసుకున్నారు. `ప్రాజెక్ట్ కేలో లెజెండరీ కమల్‌ హాసన్‌ సర్‌తో కలిసి పనిచేసేందుకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా ఉంది. అలాంటి సినిమా టైటాన్‌ లాంటి వ్యక్తితో కలిసి నేర్చుకునే, ఎదిగే అవకాశం వచ్చింది. నా కల నిజమైంది` అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు ప్రభాస్. ఇది వైరల్‌ అవుతుంది. 

కమల్‌ `ప్రాజెక్ట్ కే`లో భాగం కావడంపై చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రియాక్ట్ అవుతూ, విశ్వనటుడు కమల్‌ హాసన్‌ చిత్ర తారాగణంలో చేరడం పట్ల ఎంతో ఆతృతగా ఉన్నాను. ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసిన కమల్‌ సర్‌ లాంటి నటుడిని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆయన `ప్రాజెక్ట్ కే` లోకి వచ్చి, మా సినిమా ప్రపంచాన్ని పూర్తి చేయడానికి అంగీకరించినందుకు మేమంతా సంతోషిస్తున్నాం` అని చెప్పారు. నిర్మాత అశ్వినీదత్‌ చెబుతూ, నా కెరీర్‌లో చాలా కాలంగా కమల్‌ హాసన్‌తో పనిచేయడం ఒక డ్రీమ్‌ లాంటిది. ప్రాజెక్ట్ కే తో ఆ కల సాకారం అవుతుంది. కమల్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి పనిచేయడం ఏ నిర్మాతకైనా గొప్ప క్షణం. నా కెరీర్‌లో 50వ సంవత్సరంలో ఇది నిజంగా నాకో వరం` అన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?