kamal Haasan Comments: మాతృభాషను ఏమైనా అంటే ఊరుకోను, వార్నింగ్ ఇచ్చిన కమల్ హాసన్

By Mahesh JujjuriFirst Published May 18, 2022, 11:10 AM IST
Highlights

ప్రస్తుతం దేశం అంతా హిందీ భాష జాతీయ భాష అన్న అంశంపై పెద్ద  చర్చ జరుగుతోంది. సినిమావాళ్ళతో స్టార్ట్ అయిన ఈ వివాదం.. సినిమా చూట్టుూనే  తిరుగుతోంది. రీసెంట్ గా ఈ విషయంపై లోకనాయకుడు కమల్ హాసన్ తన స్టైల్ లో కామెంట్స్ చేశారు. 
 

దేశంలో హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ భాష గురించి కన్నడ నటుడు సుధీప్, అజయ్ దేవగణ్ మధ్య మొదలైన వాదనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఇటు సినిమావాళ్ళ చుట్టు కూడా తిరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ విషయంపై సినీ న‌టుడు క‌మ‌లహాస‌న్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కొత్త సినిమా విక్ర‌మ్ కు సంబంధించిన‌ ప్ర‌చార కార్య‌క్ర‌మం చెన్నైలో నిర్వ‌హించ‌గా అందులో పాల్గొన్న క‌మ‌ల్ మాట్లాడుతూ... త‌న మాతృ భాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటానని, దీనికి రాజకీయాలతో సంబంధం ఏమీ లేదని చెప్పారు. 

ఇక స్టార్ హీరో కమల్ హాసన్ మొదటి నుంచి కేంద్రాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. హిందీ భాషని వ్యతిరేకిస్తూ గతంలో కూడా పలు మార్లు కామెంట్స్ చేశారు. తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ”నేను హిందీని వ్యతిరేకించను, కానీ నా మాతృభాష తమిళ్ కి అడ్డుపడితే మాత్రం ఊరుకోను. దాని కోసం ఎంతవరకు అయినా పోరాడతాను అని అన్నారు.

చిన్నతనంలో నా తొలి గురువు శివాజీ గణేషన్‌ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని, నా రెండో గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడుతున్నాను. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరు అడ్డు వచ్చినా ఎదుర్కుంటాను. ఇప్పుడు భాష గురించి చర్చ జరుగుతోంది కాబట్టి చెబుతున్నాను మాతృభాషను మరవకండి. అలా అని హిందీకి వ్యతిరేకినని చెప్పను, అన్ని భాషలూ ఒకటే. అందరూ కలిస్తేనే ఇండియా అని తెలిపారు.

సినిమా, రాజకీయం కవలపిల్లలని, తాను ఈ రెండింట్లోనూ ఉన్నాన‌ని గుర్తు చేశారు. గుజ‌రాతీ, చైనీస్ భాష‌లు కూడా నేర్చుకుని, మాట్లాడ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. అన్ని భాషలను నేర్చుకోవచ్చు.. కాని మాతృభాషను మాత్రం మర్చిపోవద్దు. సొంత భాషను గౌరవించాలి అన్నారు కమల్. 
 

click me!