
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల `అఖండ` చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో దూకుడు మీదున్నాడు బాలయ్య. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా `అఖండ` నిలవడంతో ఆయనలో ఉత్తేజం ఉరకలేస్తుందని చెప్పొచ్చు. రెట్టింపు ఎనర్జీతో ఆయన తదుపరి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `ఎన్బీకే 107` చిత్రంలో నటిస్తున్నారు.
`క్రాక్` వంటి హిట్ తర్వాత గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్‌లో బాలయ్య దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇందులో బాలయ్యతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమా డైరెక్టర్ గోపీచంద్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నారు. శేఖర్ మాస్టర్ సమక్షంలో ఓ అదిరిపోయే సాంగ్‌ని షూట్ చేస్తున్నారట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ ఫోటోని పంచుకుంది యూనిట్. తమన్ అందించిన సెన్సేషనల్ ట్యూన్‌కి, శేఖర్ మాస్టర్ అమేజింగ్ మూవ్‌మెంట్స్ కంపోజ్ చేస్తున్నారని తెలిపారు.
యూనిట్ పంచుకున్న ఫోటోలో బాలయ్య లుక్ కొత్తగా ఉంది. అది మరింతగా ఆకట్టుకుంటుంది. ఆయన ఫ్యాన్స్ కి ట్రీట్‌లాగా ఉండబోతుందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇది స్పెషల్ ఐటెమ్ నెంబర్ అని తెలుస్తుంది. అయితే ఇందులో `ఖిలాడీ` భామ డింపుల్ హయతి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్తలుఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సాంగ్ ఇదేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడబోతే ఇదొక సెలబ్రేటెడ్ సాంగ్‌లా ఉండబోతుందని బాలయ్య గెటప్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. `అఖండ`ని మించి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి `అన్నగారు` టైటిల్ ప్రధానంగా వినిపిస్తుంది.