ఆంధ్రాలో భారతీయుడు 2 షూటింగ్, కామల్ హాసన్ కోసం భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Published : Jan 31, 2023, 09:28 PM IST
ఆంధ్రాలో భారతీయుడు 2 షూటింగ్, కామల్ హాసన్ కోసం భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

భారతీయుడు2 సినిమా షూటింగ్ ఆంధ్రాలో సందడి చేస్తున్నారు టీమ్. లోకనాయకుడు కమల్ హాసన్ కోసం భారీగా జనాలు తరలివచ్చారు. 

సౌత్ స్టార్ హీరో.. తమిళ లోకనాయకుడు కమల్‌  హాసన్  ప్రస్తుతం అదరగొడుతున్నాడు. ఆ మధ్య కొన్నేళ్ల పాటు సినిమాలు కలిసిరాక ఇబ్బంది పడ్డ కమల్.. చాలా  ఏళ్ల తర్వాత విక్రమ్‌ తో గ్రాండ్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు. గతేడాది జూన్‌ లో రిలీజ్ అయిన ఈ సినిమా కమల్‌ హాసన్ కెరీర్ లోనే హైయోస్ట్ కలెక్షన్స్ ను సాధించి పెట్టింది. తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దాంతో జోరు పెంచాడు లోక నాయకుడు. అదే ఊపులో ఆగిపోయిన  ఇండియన్‌-2 సినిమాను కూడా పట్టాలెక్కించాడు. వరుసగా బ్రేకులిస్తూ... పూర్తిగా ఆగిపోయిన భారతీయుడు సీక్వెల్ సినిమాను గతేడాది సెప్టెంబర్‌లో రీ స్టార్ట్ చేసి పరుగులు పెట్టిస్తున్నాడు శంకర్. 

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా రీ స్టార్ట్ అవ్వడంతో.. షూటింగ్ ను పరుగులు పెట్టిస్తన్నాడు శంకర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని జమ్మలమడుగు దగ్గరున్న గండికోటలో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో కమల్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. కాగా షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న కమల్‌ను చూసేందుకు అభిమానులు  భారీగా తరలి వచ్చారు. కమల్ కోసం ఫ్యాన్స్  బారులు తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

 

మంచి మెసేజ్ తో... యాక్షన్‌ డ్రామా బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న ఈసినిమాను డైరెక్టర్ శంకర్  అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై ఏ.సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ షూటింగ్ లో ఉన్నా కాని.. భారతీయుడు షూటింగ్ కోసం టైమ్ కేటాయించాడు శంకర్. ఈసినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌