#NTR30: ఎన్టీఆర్‌-కొరటాల సినిమా అప్‌ డేట్‌.. షూటింగ్‌ డిటెయిల్స్

Published : Jan 31, 2023, 06:53 PM IST
#NTR30: ఎన్టీఆర్‌-కొరటాల సినిమా అప్‌ డేట్‌.. షూటింగ్‌ డిటెయిల్స్

సారాంశం

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రావాల్సిన సినిమాకి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ఇప్పుడు షూటింగ్‌కి సంబంధించి దర్శకుడు కొరటాల ఓ పర్‌ఫెక్ట్ ప్లాన్‌ రెడీ చేసినట్టు తెలుస్తుంది. 

ఎన్టీఆర్‌(NTR) నెక్ట్స్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఆయన కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `NTR30` అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఆ మధ్య సంగీత దర్శకుడు అనిరుథ్‌ తో దర్శకుడు కొరటాల చర్చలు జరిపారు. మ్యూజిక్‌ సిట్టింగ్స్ చేశారు. దీంతోపాటు చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌కి సంబంధించిన మూవీ ఆఫీస్‌ని ప్రారంభించారు. 

కానీ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఎప్పుడూ షూట్‌ చేస్తారు, హీరోయిన్‌ ఎవరు అనే అంశాలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే టీమ్‌ షూటింగ్‌ కి సంబంధించి ప్లాన్‌ రచించిందట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెట్‌ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. శంషాబాద్‌లో ప్రాంతంలో ఓ సెట్‌ వేస్తున్నారట. అయితే సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందనే టాక్‌ ఆ మధ్య వినిపించింది. కానీ ఇప్పుడు ఈ నెలాఖరుకి షిఫ్ట్ చేసినట్టు లేటెస్ట్ సమాచారం. 

ఫిబ్రవరి నెలాఖరు నుంచిగానీ, లేదంటే మార్చి మొదటి వారం నుంచి గానీ చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసినట్టు టాక్. ఈ సినిమా షూటింగ్‌కి ఆల్మోస్ట్ ఏడాదిపాటు ఆలస్యమైంది. దీంతో ఇక గ్యాప్‌ లేకుండా చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల ప్లాన్‌ చేశారని తెలుస్తుంది. హైదరాబాద్‌, గోవాలో షూటింగ్‌ జరిపే ఆలోచనలో ఉన్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని అనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్‌గా శ్రీదేవి కూతురుని ఫైనల్‌ చేశారని టాక్‌. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ తోపాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్