కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే ఫస్ట్ లుక్ విడుదల..ఫ్యాన్స్ పండగ

Published : Jul 04, 2017, 09:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే ఫస్ట్ లుక్ విడుదల..ఫ్యాన్స్ పండగ

సారాంశం

కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే ఫస్ట్ లుక్ విడుదల. పుట్టినరోజుకు ఒక రోజు ముందే నందమూరి ఫ్యాన్స్ పండగ జైలవకుశ నిర్మాతగా, ఎమ్మెల్యేగా మంచి జోరు మీదున్న కళ్యాణ్ రామ్

ఓ పక్క జై లవకుశ చిత్రాన్ని నిర్మిస్తూనే మరో పక్క సొంత సినిమా ఎంఎల్ఏను వేగంగా పట్టాలెక్కించాడు నందమూరి కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రూపొందిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇటీవల కాజల్ చిత్ర యూనిట్‌తో కలిసింది. ఆమెపై ఇటీవల కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

 

ఎమ్మెల్యే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్‌కుమార్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ రామ్ పోస్టర్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్ నంద‌మూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ ఏడాది చివ‌రిలో ఈ చిత్రం విడుద‌ల కానున్నది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కల్యాణ్ రామ్ యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుండటం, పుట్టినరోజుకు ఒక రోజు ముందే విడుదల చేయటంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్