అల్లు అర్జున్ రివ్యూ.. ఆవకాయ్, పప్పు, చారు, బిర్యానీ, స్వీటు హాటూ అది ఇదీ

Published : Jul 04, 2017, 07:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అల్లు అర్జున్ రివ్యూ.. ఆవకాయ్, పప్పు, చారు, బిర్యానీ, స్వీటు హాటూ అది ఇదీ

సారాంశం

డీజే సినిమా రివ్యూలపై అసంతృప్తితో డీజే టీమ్ కమర్షియల్ హంగులన్నీ వున్నా ఏదో లేదంటూ రివ్యూలు వచ్చాయని ఆరోపణ తెలుగు సినిమా అంటే ఒకే జోనర్ కు పరిమితమయ్యే సినిమా కాదన్న బన్నీ

డీజే సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూ రైటర్స్ గురించి ఎలాంటి కమెంట్స్ చేశాడో చూశాం. ఇక డీజే మూవీ హీరోయిన్ అల్లు అర్జున్ కూడా రివ్యూ రైటర్ల పై ఏ మాత్రం తగ్గకుండా స్పందించాడు. రివ్యూ అనేది కేవలం సింగిల్ పర్సన్ ఒపీనియన్. నా సినిమా కోటిమంది చూస్తే కోటి మంది రివ్యూ ఇచ్చేస్తారు. ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రివ్యూ రేటింగ్ ఇవ్వడం ఇప్పుడు జరుగుతోంది. అమెరికా వాళ్లకు ఇదే నచ్చుద్ది, ఇలా వుంటేనే సినిమా అని అభిప్రాయాలు రుద్దడం ఏంటి. అసలు సినిమాకు ఇన్ని స్టార్లు వచ్చాయి.. అన్ని స్టార్లు వచ్చాయి అని స్టార్ రేటింగ్ ఇవ్వడం ఏంటి.. అంటూ ఓ ఇంటర్వ్యూలో రివ్యూ రైటర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫైర్ అయ్యాడు.

 

సినిమా అనేది ఒక ఎమోషన్. దానికి స్టార్ రేటింగ్ ఏంటి..? మీ మదర్ కు స్టార్ రేటింగ్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా..? అలాంటిది సినిమాకు ఎలా ఇస్తారని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఇదివరకు రివ్యూ అనేది పెద్ద ఇష్యూ కాదు కాని, టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు రివ్యూలే పెద్ద ఇష్యూ అయ్యాయని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. రివ్యూ రైటర్స్ ఎవ్వరికి కమర్షియల్ సినిమా మీద రెస్పెక్ట్ లేదని అన్నారు.

 

అసలు తెలుగు సినిమాను ప్రపంచమంతా ఇష్టపడుతుందని.. బాహుబలి లాంటి సినిమాను అందలం ఎక్కించింది కేవలం అందులోని ఎమోషన్స్, సాంగ్స్, ఫైట్స్, లవ్, రొమాన్స్, మ్యూజిల్ లాంటి అంశాలేనని.. ఇవన్నీ కలగలిసిన సినిమానే కమర్షియల్ సినిమా అని, అది కేవలం దక్షిణ భారత దేశం సినిమాలకే చెల్లుతుందని అల్లుఅర్జున్ అన్నాడు.

 

ఏ హాలీవుడ్ సినిమాతోనో మనకు పోలిక అవసరం లేదన్నాడు. కేవలం డ్రామా, యాక్షన్ తో అవి నడుస్తాయని, మన సినిమాలు రకరకాల ఎమోషన్స్ కలగలిపి నడుస్తాయని అభిప్రాయపడ్డారు. సింగిల్ జానర్ సినిమా చేయడం చాలా ఈజీ. ఒక మల్టీ జానర్  సినిమా చేయడం చాలా కష్టం.. డ్యాన్స్, పాటలు మ్యూజికల్ జానర్ ఫైట్స్ ఉంటే యాక్షన్ జానర్.. లవ్ రంటే రొమాంటిక్ జానర్, ట్విస్ట్ ఉంటే త్రిల్లర్ జానర్, సెంటిమెంట్ అంటే డ్రామా జానర్ ఇలా అన్ని జానర్లు కలిస్తేనే కమర్షియల్ సినిమా.

 

తెళ్లోల్లలా తీస్తేనే గొప్ప సినిమా.. అంటూ ఒకే జానర్ సినిమా అంటూ మన సినిమాను మనమే తక్కువ చేసుకుంటున్నామని అన్నారు. అసలు మనం తినే తిండిలోనే స్వీటు హాటు బిర్యానీ అన్నం డ్రింకు ఆవకాయ్ సాంబార్ అది ఇది ఇలా అన్నీ కావాలంటాం.. అలానే సినిమా గురించి కూడా ఆలోచిస్తామని అన్నారు. రివ్యూ రైటర్స్ అందరిని రిక్వెస్ట్ చేస్తూ చెబుతున్నా.. కమర్షియల్ సినిమా పవర్ ను తెలుసుకుని రివ్యూలు రాయండి, మన సినిమాను మనమే గౌరవించుకోవాలని అంటూ బన్ని తనదైన శైలిలో క్లాస్ పీకాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్