'సారీ బాబాయ్..' తేల్చి చెప్పిన కళ్యాణ్ రామ్!

Published : Nov 03, 2018, 03:19 PM ISTUpdated : Nov 03, 2018, 03:23 PM IST
'సారీ బాబాయ్..' తేల్చి చెప్పిన కళ్యాణ్ రామ్!

సారాంశం

నందమూరి కుటుంబానికి రాజకీయాలతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ టీడీపీ పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో నందమూరి హీరోలు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గతం టీడీపీ మహానాడు సభలకు పలుసార్లు హాజరయ్యారు.

నందమూరి కుటుంబానికి రాజకీయాలతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ టీడీపీ పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో నందమూరి హీరోలు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గతం టీడీపీ మహానాడు సభలకు పలుసార్లు హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా కళ్యాణ్ రామ్ టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఏరియా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణతో మాట్లాడి తనకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని చెప్పేశాడట. 'సారీ బాబాయ్, నేను ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేను. ప్రస్తుతం నా మైండ్ లో సినిమా తప్ప మరొక ఆలోచన లేదు. వచ్చే పదేళ్లలో సినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను' అని క్లారిటీ ఇచ్చేశాడట.

విషయం తెలుసుకున్న చంద్రబాబు.. కళ్యాణ్ రామ్ తో రహస్యంగా మీటింగ్ పెట్టి మాట్లాడాలని బాలకృష్ణకి చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎలెక్షన్స్ లో కళ్యాణ్ రామ్ ను పోటీ చేయించే విధంగా చంద్రబాబు పావులు కదిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో
Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు