Anchor Suma: రిటైర్మెంట్ ప్రకటించిన యాంకర్ సుమ?

Published : Apr 11, 2023, 02:26 PM ISTUpdated : Apr 11, 2023, 02:38 PM IST
Anchor Suma: రిటైర్మెంట్ ప్రకటించిన యాంకర్ సుమ?

సారాంశం

యాంకర్ సుమ ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె యాంకరింగ్ అండ్ యాక్టింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.   

యాంకర్ గా సుమ కనకాలది తిరుగులేని చరిత్ర. రెండు దశాబ్దాలుగా ఆమె ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. అయితే సుమ ప్రస్థానం మొదలైంది నటిగా. ఆమె హీరోయిన్ గా నటించడం విశేషం. 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్. అదే ఆమె డెబ్యూ చిత్రం. ఈ మూవీలో హీరోగా ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ నటించారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఆడలేదు. 

సుమకు నటిగా బ్రేక్ రాలేదు. దీంతో ఆమె యాంకరింగ్ వైపు అడుగులేశారు. తన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో స్టార్ యాంకర్ అయ్యారు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనలోని నటనా తృష్టను సుమ తీర్చుకున్నారు. అయితే గత ఏడాది చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి రోల్ చేశారు. జయమ్మ పంచాయితీ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి సుమ నిర్మాత కూడా అని సమాచారం. 

సినిమా ఆకట్టుకున్నా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. మరలా ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇకపై నటించే ఆసక్తి సుమకు లేదని తాజా కామెంట్స్ ధ్రువీకరిస్తున్నాయి. ఇటీవల ఆమె ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ కి గెస్ట్ గా వెళ్లారు. విద్యార్థులతో ముచ్చటించారు. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా... నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం. యాక్టింగ్ వద్దులే. అది మనకు కలిసి రావడం లేదు... అని అన్నారు. ఈ క్రమంలో సుమ యాక్టింగ్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారని కొందరు భావిస్తున్నారు. 

చెప్పాలంటే యాంకర్ గా కూడా సుమ జోరు తగ్గింది. గతంలో మాదిరి ఆమె పెద్ద మొత్తంలో షోలు చేయడం లేదు. ఇటీవల సుమ అడ్డా టైటిల్ తో ఓ టాక్ షో స్టార్ట్ చేశారు. ఇది అనుకున్నంతగా సక్సెస్ అయినట్లు లేదు. కాగా కొడుకును ఆమె హీరో చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్