Kinnerasani:రహస్యాన్ని శోధించే పనిలో చిరు అల్లుడు

Surya Prakash   | Asianet News
Published : Dec 30, 2021, 11:00 AM IST
Kinnerasani:రహస్యాన్ని శోధించే పనిలో చిరు అల్లుడు

సారాంశం

నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది.  


విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వస్తున్న చిత్రం “కిన్నెరసాని”. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. తాజాగా కళ్యాణ్ దేవ్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కిన్నెర సాని ట్రైలర్  ని రిలీజ్ చేసారు.  ఈ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.

ట్రైలర్ వీడియో చూస్తుంటే మర్డర్ మిస్టరీ లాగా ఉందని అర్థం అవుతుంది.డైలాగులు ప్రధానంగా నిలిచాయి. నటీనటుల హావభావాలు, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

 ప్రముఖ నటుడు చిరంజీవి చిన్నల్లుడైన కల్యాణ్‌దేవ్‌.. ‘విజేత’ చిత్రంతో నటుడిగా మారిన సంగతి తెలిసిందే. చివర్లో కళ్యాణ్ దేవ్ లుక్ భయం కలిగించేలా ఉంది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్ తో కళ్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ కి ఇచ్చిన నేపథ్యం చాలా బాగుంది. అశ్వద్ధామ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ కిన్నెరసాని చిత్రానికి దర్శక్మత్వంవహిస్తున్నాడు.  

Also read Bheemla Nayak update: భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్.. న్యూ ఇయర్ కి మోత మోగాల్సిందే!
 

PREV
click me!

Recommended Stories

2025 లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన 8 సినిమాలు, అందులో టాలీవుడ్ మూవీస్ ఎన్ని?
Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు