RRR Movie:ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్స్ కి సర్వం సిద్ధం... అవన్నీ పుకార్లే!

By Sambi ReddyFirst Published Dec 30, 2021, 10:53 AM IST
Highlights

ప్రకటించిన విధంగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. అక్కడ  1000 స్క్రీన్స్ లో  ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుండగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఇండియన్ మూవీగా రికార్డ్స్ నెలకొల్పనుంది.

అడుగడునా ఆర్ ఆర్ ఆర్ (RRR movie) చిత్రానికి అవరోధాలే. ఈ మూవీ కోసం జనాలు ఆతృతగా ఎదురుచుస్తున్నారు. అదే సమయంలో మూవీ అంతకంతకూ వెనక్కిపోతుంది. అనుకున్న సమయం కంటే ఏడాదిన్నర కాలం ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యమైంది. మరోసారి ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కానుందని ఉహాగానాలు మొదలయ్యాయి. ఉత్తర భారతదేశంలో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుంది. రోజురోజుకు కేసులు పెరుగుతూ పోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఢీల్లీలో థియేటర్స్ మూతపడ్డాయి.
 
ఇక మహారాష్ట్రలో సైతం ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వారం రోజుల క్రితమే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ  విధించారు. థియేటర్స్ యాభై శాతం ఆక్యుపెన్సీతో నడుపుతున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వేసే ప్రసక్తే లేదని రాజమౌళి (Rajamouli)తేల్చి చెప్పారు. ఇప్పటికే విడుదల ఆలస్యం కారణంగా చాలా నష్టం జరిగింది. అలాగే ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో నాలుగైదు నెలలు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వేయడం మంచిది కాదని రాజమౌళి భావిస్తున్నారు. 

ఇక ప్రకటించిన విధంగా జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. అక్కడ  1000 స్క్రీన్స్ లో  ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుండగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఇండియన్ మూవీగా రికార్డ్స్ నెలకొల్పనుంది. ఇండియాలో కూడా పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శన జరిగే అవకాశం కలదు. ఇక తెలంగాణాలో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కి అనుమతి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏపీలో మాత్రం దాదాపు ప్రీమియర్స్ ఉండకపోవచ్చు. 

కాగా యూస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఆర్ ఆర్ ఆర్ వన్ మిలియన్ మార్క్ దాటి వేయడం మరో రికార్డు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో జక్కన్న మరిన్ని రికార్డ్స్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉన్నారు.ముంబై, చెన్నై,  త్రివేండ్రం నగరాలలో ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 

Also read Lock down effect on RRR:.'ఆర్ ఆర్ ఆర్'కు ఎన్ని కోట్లు లాస్..?

1920లో జరిగిన రివల్యూషనరీ డ్రామాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ (NTR)కొమరం భీమ్, రామ్ చరణ్ (Ram charan)అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. బ్రిటీష్ ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా భీమ్, రామ్ ఎలాంటి పోరు సాగించారు అనేదే ఆర్ ఆర్ ఆర్ కథ. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మాత డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తుండగా, సముద్రఖని కూడా ఓ పాత్ర చేస్తున్నారు. 

Also read RRR Release Secret: ట్రిపుల్ ఆర్ జనవరి 7న రిలీజ్ అవుతుందా..? రాజమౌళి తనకు సీక్రేట్ గా చెప్పారన్న తరణ్ ఆదర్శ్

click me!