
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమర్తె శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆమెకు సంబందించిన ప్రతి న్యూస్ వైరల్ గా మారుతోంది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది.
శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కూడా శ్రీజ కళ్యాణ్ కి బదులుగా శ్రీజ కొణిదెల అని పేరు మార్చింది. అప్పటి నుంచి ఈ రూమర్లు మొదలయ్యాయి. ఇటీవల శ్రీజ తన సోదరుడు రాంచరణ్ తో ముంబై కి చిన్న వెకేషన్ కి వెళ్ళొచ్చింది. మానసికంగా బాధపడుతున్న శ్రీజని ఆటవిడుపుగా రాంచరణ్ ముంబై తీసుకువెళ్లాడనే ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ తన 3వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ ముద్దుల కుమార్తె నవిష్క సోషల్ మీడియా ద్వారా నాన్నకు బర్త్ డే విషెష్ తెలిపింది. చిన్నారి నావిష్క క్యూట్ గా బర్త్ డే విషెస్ చెప్పడం.. థాంక్యూ అంటూ కళ్యాణ్ దేవ్ మురిసిపోవడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కళ్యాణ్ దేవ్ ఇటీవల సూపర్ మచ్చి అనే చిత్రంలో నటించాడు. ఆ చిత్రానికి పెద్దగా బజ్ కూడా ఏర్పడలేదు. అలాగే కళ్యాణ్ దేవ్.. ఎవరెన్ని చెప్పినా వినకు.. నే మనసుకు నచ్చిందే చెయ్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం కూడా హాట్ టాపిక్ గా మారింది.