Neha Shetty :“DJ టిల్లు” హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

Surya Prakash   | Asianet News
Published : Feb 13, 2022, 05:07 PM IST
Neha Shetty :“DJ టిల్లు” హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

సారాంశం

 డిజే టిల్లు టైటిల్ సాంగ్ తో అంద‌రి చూపూ త‌న‌వైపు తిప్పుకున్నారు చిత్ర టీమ్. ఈ పాట‌ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కూడా వావ్ అనేలా యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యింది. సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వాటిని అందుకునే విధంగా సినిమా ఉండటం కలిసొచ్చింది.

 

నిన్న  డీజే టిల్లు చిత్రం విడుద‌ల‌ై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ, నేహాశ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. ఫస్ట్ రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. దాంతో టీమ్ అంతా ఆనందంగా ఉంది. అయితే హీరోయిన్ కు మాత్రం ఆ ఆనందం మిగలలేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించే లోపే నేహా శెట్టి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీజే టిల్లు రిలీజ్ అవ్వడానికి రెండు రోజుల ముందు ఆమె నానమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది ఈ హీరోయిన్ నేహా శెట్టి.

“నా అభిమాని నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే నా నటన చూసేందుకు అవ్వ ఎప్పుడూ ముందువరుసలో కూర్చునేది. అలాంటి అవ్వ ఇప్పుడు నా జీవితంలో సంతోషం లో పాలు పంచుకునేందుకు ఇక లేరని తలచుకుంటే నా హృదయం చలించిపోతుంది. ఐ లవ్ యు డి జే టిల్లు విజయం నీకు అంకితం చేస్తున్నా. “అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై వంశీ నిర్మించారు ఈ చిత్రాన్ని..! త్రివిక్ర‌మ్ శ్రీ‌నువాస్  స్క్రిప్ట్ గైడ్ గా వ్య‌వ‌హరించారు.ఇప్ప‌టికే సినిమా యూఎస్ లో బ్రేక్ ఈవెన్ వచ్చేసిందంటున్నారు. అన్ని చోట్ల నుంచి మంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఈ వీకెండ్  షోలు హౌస్ ఫుల్ అయ్యాయ‌న్న టాక్ అందరినీ ఆనందంలో ముంచేస్తోందిీ. డార్క్ హ్యూమర్ జానర్లో విడుద‌ల‌యిన ఈ సినిమా ఇక తెలుగురాష్ట్రాల‌లోనూ భారీ కలెక్షన్స్ తెచ్చి పెడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్‌ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్‌ రూ. 8.10కోట్ల షేర్‌ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్‌ఈవెన్‌ సాధించినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా అదిరిపోయే  లాభాలను తీసుకొస్తుందంటున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా