రాజశేఖర్ 'కల్కి' కాపీనా.. అసలు నిజం తేల్చారు!

By tirumala ANFirst Published Jun 21, 2019, 8:28 PM IST
Highlights

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో చాలా కాలం తర్వాత విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంతో రాజశేఖర్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం 'కల్కి'. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరక్కుతోంది. '

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో చాలా కాలం తర్వాత విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంతో రాజశేఖర్ చేస్తున్న మరో కొత్త ప్రయత్నం 'కల్కి'. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరక్కుతోంది. 'అ!' ఫేం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అదా శర్మ కథానాయకిగా నటిస్తోంది. సి కళ్యాణ్ నిర్మాత. 

కల్మి చిత్రాన్ని జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో కల్కి చిత్రం కాపీ వివాదంలో చిక్కుకుంది. కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత 'కల్కి' కథ నాది అంటూ ముందుకు వచ్చాడు. దీనితో ఈ పంచాయతీ 'కథా హక్కుల వేదిక' వద్దకు వెళ్ళింది. 

తాజాగా కల్కి చిత్ర వివాదంపై కథా హక్కుల వేదిక కన్వీనర్ బివిఎస్ రవి స్పందించారు. తాము కథా హక్కుల వేదికని ఏర్పాటు చేసి రచయితల మధ్య , దర్శకుల మధ్య తలెత్తుతున్న వివాదాలని పరిష్కరిస్తున్నామని రవి అన్నారు. కల్కి చిత్రం గురించి మాట్లాడుతూ.. తాము రచయిత కార్తికేయ కథని, కల్కి స్క్రిప్ట్ ని పరిశీలించామని అన్నారు. కానీ ఈ రెండు కథలో ఎలాంటి పోలికలు కనిపించలేదు. కల్కి చిత్రం కాపీ కాదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. 

కథా హక్కుల వేదిక వద్ద కల్కి సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఒకవేళ కథల్లో పోలిక ఉన్నా, రెండు కథలు ఒకేలా ఉన్నా అసలైన రచయితకు క్రెడిట్ ఇవ్వడం లేదా నగదు చెల్లించమని నిర్మాతలకు చెప్పడం ద్వారా సమస్య పరిష్కరిస్తామని బివిఎస్ రవి అన్నారు. 

click me!