ఆసుపత్రి నుంచి శర్వానంద్ డిశ్చార్జ్!

By tirumala ANFirst Published Jun 21, 2019, 7:54 PM IST
Highlights

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల బ్యాంకాక్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 96 చిత్ర రీమేక్ సన్నాహకాలతో భాగంగా శర్వానంద్ స్కైడైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు.

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల బ్యాంకాక్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 96 చిత్ర రీమేక్ సన్నాహకాలతో భాగంగా శర్వానంద్ స్కైడైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో శర్వానంద్ భుజానికి బలమైన గాయమైంది. కాలికి కూడా గాయమైంది. కానీ భుజానికి తగిలిన గాయమే ఎక్కువ తీవ్రమైంది. 

దీనితో శర్వానంద్ కు హైదరాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించారు. దాదాపు 11 గంటలపాటు శ్రమించిన వైద్యులు  శర్వానంద్ కు సర్జరీ పూర్తి చేశారు. భుజంలో ఎముక ఎక్కువగా విరగడంతో ఓ ప్లేట్, కొన్ని స్క్రూలు పెట్టి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. చికిత్స విజయవంతంగా పూర్తయింది. కానీ శర్వానందన్ మాత్రం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 

శుక్రవారం రోజు వైద్యులు శర్వానంద్ ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సరైన ఫిజియో థెరపీతో శర్వానంద్ త్వరలో కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. 

click me!