ఎంటర్‌టైన్‌ చేయకపోతే వెళ్లిపోండి.. కలవరపెడుతున్న కాజోల్‌ పోస్ట్..

Published : Aug 01, 2022, 08:33 PM IST
ఎంటర్‌టైన్‌ చేయకపోతే వెళ్లిపోండి.. కలవరపెడుతున్న కాజోల్‌ పోస్ట్..

సారాంశం

నిన్నటి(ఆదివారం)తో కాజోల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, సినిమాల్లోకి ప్రవేశం చేసి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకి విషెస్‌ తెలియజేశారు.

`దిల్‌ వాలే దుల్హానియా లే జాయేంగే` చిత్రంతో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది కాజోల్‌. ప్రేమ కథా చిత్రాల్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కోట్లాది మంది అభిమానులను ఏర్పర్చుకుంది. ఇప్పుడు ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న కాజోల్ అడపాదడపా సినిమాలు చేస్తుంది. ప్రాధాన్యత కలిగిన పాత్రలే ఎంచుకుంటుంది. ఈ క్రమంలో కాజోల్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె పెట్టిన పోస్ట్ ఆలోచింప చేస్తుంది. సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. 

కాజోల్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 30ఏళ్లు పూర్తయ్యింది. జులై 31న ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నటించిన `బేఖుడి` చిత్రం విడుదలై ముప్పై ఏళ్లు అవుతుంది. రాహుల్‌ రావైల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  కమల్‌ సాదనాతో కలిసి కాజోల్‌ నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. తొలి చిత్రమే హిట్‌ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాలతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది కాజోల్‌. 

నిన్నటి(ఆదివారం)తో కాజోల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, సినిమాల్లోకి ప్రవేశం చేసి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకి విషెస్‌ తెలియజేశారు. విశేషంగా ప్రేమని చూపించారు. ఈ సందర్భంగా వారందరికి థ్యాంక్స్ చెప్పింది కాజోల్‌. వారి ప్రేమ పట్ల కృతజ్ఞురాలినై ఉంటానని పేర్కొంది. అయితే సోమవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఇందులో కాజోల్‌ చెబుతూ, `మీరిక్కడ నన్ను ఎంటర్‌టైన్‌ చేయడానికి లేకుంటే దయజేసి వెనక్కి వెళ్లిపోండి. ఏదైనా కొత్త విషయాలను ఉన్నప్పుడు తిరిగి రండి` అని పేర్కొంది. అయితే కాజోల్‌ ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది. ఎవరిని ఉద్దేశించి పెట్టింది. ఇప్పుడే ఎందుకు పెట్టిందనేది బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. అనేక అనుమానాలకు తావిస్తుంది. కాజోల్‌ ఈ సస్పెన్స్ పోస్ట్ వెనకాల ఏముందనేది ప్రశ్నగా మారింది. మరోవైపు అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. ఆమె ఇండస్ట్రీని ఉద్దేశించిన పెట్టిందా? ఏదైనా కోట్‌ని పంచుకుందా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాలీవుడ్‌లో చర్చకి తెరలేపుతుంది. 

ఇక కాజోల్‌ బాలీవుడ్‌లో `దిల్‌వాలే దుల్హానియ లే జాయేంగే`, `గుప్గ్`, `ప్యార్‌ కియా తో డర్నా క్యా`, `ప్యార్‌ తో హోనా హై థా`, `మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌`, `హెలికాప్టర్ ఈలా`, `తానాజీ` వంటి చిత్రాల్లో నటించింది. `తానాజీ` చిత్రానికి మూడు జాతీయ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె `సలామ్‌ వెంకీ` అనే సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది. కాజోలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్‌ ఉన్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?