నయన్, త్రిష ఇప్పుడు కాజల్

Published : Feb 27, 2017, 02:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
నయన్, త్రిష ఇప్పుడు కాజల్

సారాంశం

నయన్, త్రిషల్లా తనూ మారిపోనున్న కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన కాజల్ ఇక లేడీ ఓరియెంటెడ్ కేరక్టర్ తో అలరించనుమ్మ ముద్దుగుమ్మ

నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నంటిచి బాగా రాణిస్తున్నారు. ఇప్పుడు కాజల్‌అగర్వాల్‌కు కూడా అదే బాట పట్టనుంది. గ్లామర్ పాత్రల్లో నటిస్తూ.. టాప్ లీగ్ లో కొనసాగుతున్న కాజల్ ఇక గ్లామర్ కే కాక ప్రతిభ గల లేడీ పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతోంది.

 

ఇప్పటి దాకా గ్లామర్ పాత్రలకే పరిమితవైున ఈ గుజరాతీ బ్యూటీ కెరీర్‌ మధ్యలో కాస్త డౌన్ అయినా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్‌తో వివేకం చిత్రంలోనూ, విజయ్‌ 61వ సినిమాలోనూ నటిస్తోంది. ఇక నుంచి తను గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ... నటించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అనుకున్నది అమలు చేసే అవకాశం చేజిక్కించుకుంది. 

 

దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్  సెంట్రిక్‌ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నాడు. కాజల్‌ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్‌ చిత్రంలో నటించింది. ఆ స్నేహం కారణంగానే ఈ హీరోయిన్  ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్‌ను వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్‌ కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు సంతోషంగా పీలవుతోందట.

PREV
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్