మూడుముళ్ళతో ఒక్కటైన కాజల్‌-గౌతమ్‌ కిచ్లు.. పెళ్ళి ఫోటో వైరల్‌

By Aithagoni RajuFirst Published 30, Oct 2020, 8:20 PM
Highlights

అధికారికంగా బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి, ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్‌. అతికొద్ది మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా కాజల్‌- గౌతమ్‌ కిచ్లుల వివాహం గ్రాండ్‌గా ఈ సాయంత్రం ముంబయిలో జరిగింది. 

కాజల్‌ ఇప్పుడు కాజల్‌ కిచ్లుగా మారింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుకి ఈ శుక్రవారం సాయంత్రం భార్యగా మారిపోయింది. కిచ్లుతో తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. ఇక అధికారికంగా బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి, ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టింది. అతికొద్ది మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా కాజల్‌- గౌతమ్‌ కిచ్లుల వివాహం ఈ సాయంత్రం ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. 

తాజాగా పెళ్ళికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. లైట్‌ పింక్‌ కలర్‌ డెకరేషన్‌తో కళ్యాణ వేదిక ఆకట్టుకోగా, వైట్‌ డ్రెస్‌లో కిచ్లు, రెడ్‌, పింక్‌ మేళవింపు డ్రెస్‌లో, భారీ డిజైనర్‌ వేర్‌లో కాజల్‌ కనిపిస్తున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాజల్‌ మరింత సంతోషంగా ఉన్నారు. అయితే వీరి డ్రెస్, కళ్యాణ వేదిక బ్యాక్‌గ్రౌండ్‌ సేమ్‌ కలర్స్ ఉండటంతో కాజల్‌, కిచ్లు హైలైట్‌ కావడం లేదు. కానీ ఇదొక యూనిఫామ్‌గా డిజైన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం వీరి మ్యారేజ్‌ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు విశెష్‌ తెలియజేస్తున్నారు. 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 30, Oct 2020, 8:49 PM