
తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేని హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). విభిన్న పాత్రల్లో తెలుగు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బాద్ షా, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి సౌత్ లో స్ట్రాంగ్ పాపులారిటీని దక్కించుకుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ కూడా మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుందీ స్టార్ హీరోయిన్. 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ సుందరి.. సినిమాలకు మాత్రం పుల్ స్టార్ పెట్టలేదు. అటు మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే ఇటు కేరీర్ లోనూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీగా ఉన్న కాజల్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోంది. అయితే అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ కాజల్ యాక్టివ్ గానే ఉంటోంది. తన గతంలో బాడీ షేమింగ్ పైనా పలువురు చేసిన కామెంట్లను తిప్పికొట్టింది. అదిరిపోయే కౌంటర్లతో స్పందించింది. జీవితంలోని ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే మహిళా దినోత్సవం సందరర్భంగా తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.
బాంబే బ్యూటీ కాజల్ అగర్వాల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేస్తూ పలు సూచనలు చేస్తోంది. ఆడవాళ్ల హక్కులు, స్వేచ్ఛ జీవితం పొందానికి ఏం చేయాలో చెప్పింది. ఈ వీడియో కాజల్ .. కాఫీ తాగుతూ.. బుక్స్ చదువుతూ కనిపిస్తోంది. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ రుచికరమైన ఆహార పదార్థాలను తీసుకుంటుంది. కాగా ఈ వీడియో షేర్ చేస్తూ ఒక నోట్ రాసింది. ‘మనం శక్తిమంతులం. మనం ఏ భాష మాట్లాడినా, ఎలాంటి దుస్తులు వేసుకున్నా లేదా మనం ఎంచుకున్న పనిలో ముందుకు వెళ్లేందుకు భయపడాల్సిన పనిలేదు. ముఖ్యంగా.. మనకు ప్రతిది ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మనకు కావాల్సిన జీవితాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ ధైర్యవంతులైన, స్థితిస్థాపకత ఉన్న స్త్రీలను మనం గౌరవించాలి. వారిని ముందుకు తీసుకెళ్లాలి. వారిని ఉద్ధరించాలి. ఎందుకంటే వారు తల్లులుగా, సోదరీమణులు, కుమార్తెలుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పటికీ మహిళలు కలిసిగట్టుగా ఐక్యంగా ఉండాలి. అప్పుడే జీవితంలో మనల్ని మనం ఆపదల నుంచి రక్షించుకోగలం.’ అంటూ సూచించింది.
ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ తన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తోంది. కుటుంబ సభ్యులతో సరదా గడుపుతోంది. కేరీర్ విషయానికొస్తే కాజల్ చివరిగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తో కలిసి నటించిన మలయాళ చిత్రం ‘హే సినామిక’ (Hey Sinamika) ఇటీవల ఈనెల 3న రిలీజ్ అయ్యింది. కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.