20 ఎకరాల పొలం కొన్న అమితాబ్... ధర ఎన్ని కొట్లో తెలుసా?

By Sambi ReddyFirst Published Apr 22, 2024, 5:02 PM IST
Highlights


నటుడు అమితాబ్ తన సంపాదనను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడుతున్నారట. లేటెస్ట్ గా ఆయన 20 ఎకరాల పొలాన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేశాడట. 
 

అమితాబ్ బచ్చన్ దశాబ్దాలుగా సినీ ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టార్ గా వెలిగారు. ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు ఆయనకు దక్కుతున్నాయి. కొన్ని చిత్రాల్లో మెయిన్ లీడ్ సైతం చేస్తున్నారు. ఇక కోన్ బనేగా కరోడ్ పతీ హోస్ట్ గా ఆయన బ్రాండ్ సెట్ చేశారు. 80 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ పలు రంగాల్లో రాణిస్తున్నారు. 

ఏడాదికి అమితాబ్ సంపాదన కోట్లలో ఉంది. ఈ మొత్తాన్ని ఆయన రియల్ ఎస్టేట్ లో పెడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా అమితాబ్ బచ్చన్ 20 ఎకరాల పొలం కొన్నారట. ముంబై శివారులో గల అలీబాగ్ ప్రాంతంలో ఆయన ఈ నేల కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ భూమి ధర రూ. 10 కోట్లు అని సమాచారం. హౌస్ ఆఫ్ అభినందన్ లోధా అనే సంస్థ నుండి అమితాబ్ కొనుగోలు చేశారట. గతంలో అయోధ్యలో ఇదే సంస్థ నుండి ఆయన భూమిని కొన్నారు. దాని ధర రూ. 14.5 కోట్లు అని సమాచారం. కాగా ఒక దశలో అమితాబ్ ఉన్నది అంతా పోగొట్టుకుని దివాళా తీశారు. కోన్ బనేగా కరోడ్ పతీ హోస్ట్ గా సక్సెస్ అయిన అమితాబ్ తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 

కాగా అమితాబ్ తెలుగులో కల్కి 2829 AD  చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఆయన ద్రోణాచార్యుడు పుత్రుడైన అశ్వద్ధామ పాత్ర చేస్తున్నారు. టీజర్ అంచనాలకు మించి ఉంది. కల్కి మూవీలో అమితాబ్ పాత్రపై క్యూరియాసిటీ పెంచేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి చిత్రంలో కమల్ హాసన్ సైతం కీలక రోల్ చేస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 
 

click me!