ఈ ఫోటోతో కాజల్ ఏం చెప్తోందో చూడండి.. రానాతోనట

Published : Jun 13, 2017, 07:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఈ ఫోటోతో కాజల్ ఏం చెప్తోందో చూడండి.. రానాతోనట

సారాంశం

రానా సరసన రాధగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ దర్శకుడు తేజతో లక్ష్మీ కళ్యాణం తర్వాత నేనే రాజు నేనే మంత్రిలో కాజల్

'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ ఈ సినిమాకి సంబంధించి కొంత కాలం క్రితం సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ అప్పట్లో సెన్సేషన్‌. అందులో రానాను కేవలం వెనుక నించి మాత్రమే కనిపించేలా ఉంటుంది. దాంతో ఆ అబ్బాయి ఎవరా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. కొంత మంది 'కాజల్‌ అగర్వాల్‌ పెళ్ళి పీటలెక్కబోతోందేమో..' అనుకున్నారు. ఆ తర్వాతే అసలు విషయం బోధ పడింది.

 

లేటెస్ట్‌గా కాజల్‌ మరో స్టిల్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈసారీ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాకి సంబంధించినదే. షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయ్యిందని పేర్కొంటూ, ఈ స్టిల్‌ని కాజల్‌ పోస్ట్‌ చేసింది. సినిమా ప్రమోషన్ లో కాజల్ తనదైన ప్రమోషన్ ఇస్తోంది.  తన క్రియేటివిటీతో ప్రత్యేకమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ కాజల్‌ టాలెంట్‌ ఏంటో చూపిస్తోంది.

 

కాజల్‌ అగర్వాల్‌ని తెలుగు తెరకు దర్శకుడు తేజ 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో పరిచయం చేశాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు తేజ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్‌ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్.. ఆ విషయమే చెప్తూ.. ఓ ఆసక్తికరమైన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది. రానా భార్యగా నటిస్తున్న కాజల్ ఆ సీన్ లో నటించిందని, ఆ సందర్భంగా తీసిన ఈ పిక్ సోషల్ మీడియాలో పెట్టి హీటు పెంచుతోందని అంతా అనుకుంటున్నారు. కాజల్ నిజంగా టాలెంటెడే. 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది