Kajal: పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన కాజల్‌..

Published : Apr 19, 2022, 05:56 PM IST
Kajal: పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన కాజల్‌..

సారాంశం

కాజల్‌ తల్లి అయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. మంగళవారం  కాజల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది.

కాజల్‌ జీవితంలోకి మరో కొత్త వ్యక్తి వచ్చారు. కాజల్‌, గౌతమ్‌ కిచ్లు ఇప్పుడు ముగ్గురయ్యారు. అవును.. కాజల్‌ తల్లి అయ్యింది. ఆమె పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. మంగళవారం  కాజల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్తలు బాలీవుడ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాజల్‌ మంగళవారం మగబిడ్డకి జన్మనిచ్చారని, దీంతో ఇప్పుడు గౌతమ్‌ కిచ్లు ఫ్యామిలీలో ఆనంద క్షణాలు నెలకొన్నాయని కామెంట్ చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌.. 2020 అక్టోబర్‌లో గౌతమ్‌ కిచ్లుని మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 6న ప్రకటించి, అక్టోబర్‌ 30న అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో కాజల్‌, గౌతమ్‌ కిచ్లు ఒక్కటయ్యారు. గౌతమ్‌ కిచ్లు ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేస్తుంటారు. మ్యారేజ్‌ తర్వాత కూడా కాజల్‌ సినిమాలు చేసింది. `ఆచార్య`, `మోసగాళ్లు` చిత్రాల్లో నటించింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే కాజల్‌ ప్రెగ్నెంట్‌ అనే విసయాన్ని గౌతమ్‌ కిచ్లు ప్రకటించారు. 

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని, తామకి ఈ ఇయర్‌ చాలా స్పెషల్‌ అని పేర్కొన్నారు. అంటే అప్పటికే కాజల్‌ ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు ఆమె ఏప్రిల్‌ 19న(నేడు) మగబిడ్డకి జన్మనివ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్లెస్సింగ్స్ ని అందిస్తున్నారు. ఇక కాజల్‌ నటిస్తున్న `ఆచార్య` చిత్రం ఈనెల 29న విడుదల కాబోతుండటం విశేషం. చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?