
హాలీవుడ్ చిత్రం `థోర్` సంచలన గురించి చెప్పాల్సిన పనిలేదు. `థోర్` ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన ప్రతీ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉండటం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా `ధోర్` ఫేజ్ -4 రెడీ అయింది. రిలీజ్ కి సమయం ఆసన్నమవ్వడంతో టీజర్ తో ప్రచార మొదలైంది. క్రిస్ హేమ్స్వర్త్ నటించిన-`థోర్: లవ్ అండ్ థండర్` మొదటి టీజర్ కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయింది. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ టీజర్ ని అడ్డం పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై పరిటాల శ్రీరామ్ సెటైర్స్ వేసారు. అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
“డియరెస్ట్ #థోర్ ⚡️..జూలై 8న మిమ్మల్ని తిరిగి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము...కానీ ఈసారి దక్షిణ భారతదేశంలోని #ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి మాకు ఒక ప్రత్యేక అభ్యర్థన ఉంది...మీరు మీ ఉరుములతో కూడిన శక్తులను ఉపయోగించి మాకు విద్యుత్ కొంత సరఫరా సహాయం చేయగలరా, దయచేసి!! ⚡️,”
ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య గ్రూపు రాజకీయాలు సహజంగానే సాగుతుంటాయి. ముఖ్యంగా వైయస్ జగన్, పరిటాల ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా ఉండేది. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా జగన్ పై సెటైర్స్ వేస్తున్నారు పరిటాల శ్రీరామ్.
గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో 25,575 ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఈ నియోజకర్గ ఇంచార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో మమేకమవుతున్నారు.
ఇక థోర్ విషయానికి వస్తే... మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4లో భాగమైన ఈ చిత్రం జూలై 8 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. `ఎ థోర్: లవ్ అండ్ థండర్` ప్లాట్ రివీల్ చేశారా? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
థోర్ అడవిలో పరుగెత్తడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అప్పుడు థోర్ ఇలా అంటాడు-``ఈ చేతులు ఒకప్పుడు యుద్ధానికి ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు అవి శాంతికి సాధనాలుగా ఉపయోగించబడుతున్నాయి. నేను ఎవరో ఖచ్చితంగా గుర్తించాలి. అతను ఇలా అంటాడు.
“నేను నా స్వంత మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. ఈ క్షణంలో జీవించు. నా సూపర్ హీరో రోజులు ముగిశాయి. ” గాడ్ ఆఫ్ థండర్ స్వీయ-ఆవిష్కరణ ప్రయాణం ప్రారంభించినట్లు వీడియో మాంటేజ్ చూపిస్తుంది. అక్కడ అతను గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ నుండి పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్)తో సహా కొంతమంది పాత స్నేహితులను కలుస్తాడు.
పీటర్ క్విల్ థోర్ను మీరు ఇష్టపడే వ్యక్తిని ఎప్పుడు తప్పిపోయినా అతని కళ్లలోకి చూడమని చెప్పడం కనిపిస్తుంది. టీజర్ రస్సెల్ క్రోవ్ని జ్యూస్గా చూపిస్తుంది. కానీ అతని ముఖాన్ని బహిర్గతం చేయకుండా. టీజర్ చివర్లో థోర్ మాజీ ప్రేయసి జేన్ ఫోస్టర్ పాత్రను పోషించిన నటాలీ పోర్ట్మన్- థోర్ యొక్క మ్జోల్నిర్ను ఎత్తడం కనిపిస్తుంది-ఇది ఎవరికైనా థోర్ యొక్క అధికారాలను అందించే అద్భుతమనే చెప్పాలి.