
పుష్ప మూవీ బన్నీ ఇమేజ్ ఆకాశానికి చేర్చింది. ఈ మూవీ హిట్ తో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుక్కున్న అల్లు అర్జున్ వెంట దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అనేక సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఓ యాడ్ షూట్ కి ఆయన కోట్లలో ఛార్జ్ చేస్తున్నారట. గంటల వ్యవధిలో పూర్తయ్యే ప్రతి యాడ్ కి అల్లు అర్జున్ రూ.7.5 కోట్లు తీసుకుంటున్నారట. ఇది బాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్ కంటే అధికమని తెలుస్తుంది.
అలాగే ఓ పొగాకు సంస్థ అల్లు అర్జున్(Allu Arjun) కి భారీ మొత్తంలో ఆఫర్ చేశారట. తమ యాడ్ షూట్ లో భాగంగా కొన్ని నిమిషాల షూట్ కోసం రూ. 10 కోట్లు ఇస్తామన్నారట. అయితే అల్లు అర్జున్ సదరు యాడ్ చేయనన్నారట. సోషల్ మీడియా విప్లవం నేపథ్యంలో హానికారక ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న హీరోలను నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్స్ అలాంటి సాహసం చేయడం లేదు. అందుకే అల్లు అర్జున్ ఆ ఆఫర్ తిరస్కరించాడు. అందులోనూ ఇటీవల అల్లు అర్జున్ నటించిన రెండు మూడు యాడ్స్ వివాదాస్పదం అయ్యాయి.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ కి సిద్ధం అవుతున్నారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. పుష్ప 2 బడ్జెట్ రూ. 350 కోట్లు కాగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ.100 కోట్లుకు పైనే అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ పది భాషల్లో పుష్ప 2 విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ క్రేజీ సీక్వెల్ లో జాయిన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.