'వెడ్డింగ్ వెన్యూ' విషయమై క్లారిటీ ఇచ్చిన కాజల్

By Surya PrakashFirst Published Oct 13, 2020, 8:28 AM IST
Highlights

క‌రోనా లాంటి క్లిష‌మైన ప‌రిస్థితుల్లో సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నా – ఈ మూమెంట్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంద‌ని కాజ‌ల్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.అయితే గ్రాండ్ వెడ్డింగ్, ఇత‌ర కార్య‌క్ర‌మాలు మాత్రం కాజ‌ల్ ఇష్టానిక‌నుగుణంగా మెరైన్ డ్రైవ్ లోని ఇంట్లోనే జ‌రుగ‌నున్నాయ‌ని తెలుస్తోంది.
 

కాజ‌ల్ త్వ‌ర‌లో పెళ్లి కూతురు కాబోతున్న సంగతి తెలిసిందే. గౌత‌మ్ అనే వ్యాపార వేత్త‌ని పెళ్లి చేసుకోబోతోంది. తాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు అఫీషీయల్ గా ప్ర‌క‌టించింది. అక్టోబ‌రు 30న పెళ్లికి ముహూర్తంగా నిర్ణ‌యించార‌ని తెలిపింది.  అయితే ఆమె పెళ్లి వెన్యూ ఎక్కడ..స్టార్ హోటల్ లో చేసుకోబోతోందనే వార్తలో నిజమెంత అనేది ఇప్పుడు ఆమె అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మ‌హారాష్ట్ర‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ కానీ, లేదంటే క్లాసీ స్టార్ హోట‌ల్ లో కానీ కాజ‌ల్ పెళ్లివేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి ఈ విషయమై కూడా కాజల్ క్లారిటీ ఇచ్చేసింది. 

ముంబైలో అతి త‌క్కువ‌మంది స‌న్నిహితులు, స్నేహితుల మ‌ధ్య సింపుల్ గా త‌న పెళ్లి జ‌ర‌గ‌బోతున్న‌ట్టు చెప్పేసింది. హంగామా ఏమీ లేనట్లు తెలియచేసింది.  క‌రోనా లాంటి క్లిష‌మైన ప‌రిస్థితుల్లో సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నా – ఈ మూమెంట్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంద‌ని కాజ‌ల్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.అయితే గ్రాండ్ వెడ్డింగ్, ఇత‌ర కార్య‌క్ర‌మాలు మాత్రం కాజ‌ల్ ఇష్టానిక‌నుగుణంగా మెరైన్ డ్రైవ్ లోని ఇంట్లోనే జ‌రుగ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

ఈ జంట బిజీగా షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ దుబాయ్, మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్ లో ఎంజాయ్ చేసింది.  పెళ్లి త‌ర‌వాత కూడా సినిమాల్లో న‌టిస్తాన‌న్న భ‌రోసాని త‌న అభిమానుల‌కు క‌లిగించింది కాజ‌ల్. ప్ర‌స్తుతం `ఆచార్య‌`తో పాటు విష్ణు సినిమా `మోస‌గాళ్లు`లోనూ న‌టిస్తోంది కాజ‌ల్.

click me!