బస్సు ప్రయాణంలో ఏం జరిగిందో ఊహించలేదట

Published : Oct 12, 2020, 11:22 PM IST
బస్సు ప్రయాణంలో ఏం జరిగిందో ఊహించలేదట

సారాంశం

శ్రీరామ్‌ నటించిన బైలింగ్వల్‌ చిత్రాన్ని తెలుగులో `ఊహించలేదు కదు` పేరుతో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

బస్సు ప్రయాణంలో ఏం జరిగిందో ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు హీరో శ్రీరామ్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `ఓం శాంతి ఓం`. తెలుగు, తమిళం బైలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెహమాన్‌ క్రియేటివ్‌ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.

దీన్ని  తెలుగులో `ఊహించలేదు కదు` పేరుతో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో శ్రీరామ్‌ సరసన నీలమ్‌ ఉపాధ్యాయ నటించారు. బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదం, హీరో ఒక్కడే బతికి ఉండటం, ఆపై జరిగిన పరిణామాల సమాహారమే ఈ చిత్రమని చిత్ర బృందం చెబుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మరి ఈ సినిమాతో శ్రీరామ్‌ పూర్వవైభవాన్ని పొందుతాడా? అన్నది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?