పెళ్లైన క్రికెటర్ పై మనసు పారేసుకున్న కాజల్!

Published : Apr 29, 2019, 04:10 PM ISTUpdated : Apr 29, 2019, 04:20 PM IST
పెళ్లైన క్రికెటర్ పై మనసు పారేసుకున్న కాజల్!

సారాంశం

సినిమా వాళ్లకు క్రికెటర్లకు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంటుంది.

సినిమా వాళ్లకు క్రికెటర్లకు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంటుంది. వీళ్లని వాళ్లు, వాళ్లని వీళ్లు తెగ ఇష్టపడుతుంటారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టార్ హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకున్నాడు. వారు ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

అయితే తనకు అలాంటి ఛాన్స్ రాలేదని పరోక్షంగా చెబుతోంది నటి కాజల్. వ్యక్తిగతంగా కాజల్ కి ముంబై బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టమట. అతడు బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగితే చూస్తుండిపోతానని చెప్పుకొచ్చింది.

ఒక్కసారి మొదలుపెడితే రెండు సెంచరీలు తీసికానీ బయటకి రాని రోహిత్ ని చూస్తుంటే అసలు టైమే తెలియదని అంటోంది కాజల్. ఆమె మాటలు వింటుంటే రోహిత్ పై కాజల్ కి క్రష్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కానీ రోహిత్ కి ఇదివరకే పెళ్లైంది. ఓ పాప కూడా ఉంది. సో.. కాజల్ తన అభిమాన క్రికెటర్ ని మిస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు