అతడి కాలర్ పట్టుకొని కొట్టా.. కాజల్ కామెంట్స్!

Published : Feb 04, 2019, 09:40 AM IST
అతడి కాలర్ పట్టుకొని కొట్టా.. కాజల్ కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. 

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

తన మార్కెట్ పడిపోతుందని తాను ఎప్పుడూ భయపడలేదని, దానికి కారణం వరుసగా అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయని వెల్లడించింది. ఆ కారణంగానే పెళ్లి ఆలోచన పక్కన పెట్టినట్లు తెలిపింది. 

ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. తనకు నచ్చినవాడు ఎదురుపడితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, లేదంటే పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. ఇక తాను చాలా ధైర్యవంతురాలినని చెప్పిన కాజల్.. ఒకసారి తన స్నేహితురాలిని ఒక వ్యక్తి వేధింపులకు గురి చేశాడని, అప్పుడు తాను అతని చొక్కా కాలర్ పట్టుకొని ముఖం పచ్చడయ్యేలా కొట్టానని చెప్పింది.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. అవకాశాల కోసం పడకగదికి పిలుస్తున్నారని కొందరు చెబుతున్నారని, అది అబద్ధం కాదని చెప్పుకొచ్చింది. అయితే అలాంటి సంఘటనలను తానెప్పుడూ  ఎదుర్కోలేదని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Rachita Ram: బాడీ షేమింగ్ కామెంట్స్ పై కూలీ నటి స్ట్రాంగ్ రియాక్షన్, అలాంటి వాళ్ళు నిజంగా మూర్ఖులే
Malavika Mohanan: డైలాగ్స్ చెప్పమంటే ఏబీసీడీలు చదువుతారు.. హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ కామెంట్స్