కాజల్ ఆంటీకి కొడుకు పుట్టాడు... తెగ మురిసిపోతోంది

Published : Feb 22, 2018, 02:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కాజల్ ఆంటీకి కొడుకు పుట్టాడు... తెగ మురిసిపోతోంది

సారాంశం

దక్షిణాదిలో క్రేజీస్టార్ గా ప్రముఖ హిరోయిన్ కాజల్ కాజల్ చెల్లి నిషా కొన్ని సినిమాల్లో హిరోయిన్ తాజాగా నిషాకు కొడుకు పుట్టడంతో మురిసిపోతున్న కాజల్

కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు.. ఆమె చెల్లెలు అనే ఇమేజ్ తో తెరపైకి వచ్చింది నిషా అగర్వాల్. కొన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది ఆ అందాల భామ. అయితే అక్కలా ఆమె కెరీర్ ఊపు మీదకు రాలేదు. చేసిన కొన్ని సినిమాలతో సరిపెట్టుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఒక ప్రముఖ వ్యాపార వేత్తను నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుంది.

 

ఆ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు చెల్లెలు గురించి కొత్త కబురు చెప్పింది కాజల్. తన చెల్లెలు పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని కాజల్ ట్వీట్ చేసింది. నిషా అగర్వాల్ ఒక బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని ఆనందంగా పంచుకుంది కాజల్.
 

పెద్దమ్మ అయిన కాజల్ అగర్వాల్.. తన చెల్లెలు కొడుకు పేరును కూడా ప్రకటించింది. పిల్లాడికి ‘ఇషాన్’అని పేరు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు