`ఖైదీ 2` క్రేజీ అప్‌డేట్‌.. ప్రారంభమయ్యేది అప్పుడే.. కన్ఫమ్‌ చేసిన కార్తి..

Published : Aug 09, 2022, 09:20 PM IST
`ఖైదీ 2` క్రేజీ అప్‌డేట్‌.. ప్రారంభమయ్యేది అప్పుడే..  కన్ఫమ్‌ చేసిన కార్తి..

సారాంశం

కార్తి హీరోగా `విక్రమ్‌` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన `ఖైదీ` చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌ రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు కార్తి. 

కార్తి(Karthi)కి ఇటీవల మంచి సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం `ఖైదీ`(Kaithi). `విక్రమ్‌` ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడేళ్ల క్రితం వచ్చి భారీ విజయం సాధించింది. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమిళ ఆడియెన్స్ నే కాదు, తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక్కడ కూడా మంచి కలెక్షన్లని సాధించింది. 

లోకేష్‌ కనగరాజ్‌ తన సినిమాటిక్‌ యూనివర్స్ కాన్సెప్ట్ కి భీజం వేసింది ఈ చిత్రంతోనే. ఆ తర్వాత ఆయన విజయ్‌ తో `మాస్టర్‌`, `విక్రమ్‌`(Vikram) చిత్రాలను రూపొందించారు. ఇందులో `ఖైదీ`(Kaithi2)కి సీక్వెల్‌ లింక్‌, `విక్రమ్‌`కి సీక్వెల్‌ లింక్‌ ఇచ్చాడు. దీంతో లోకేష్‌నుంచి ఈ `లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్` నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయనేది స్పష్టమైంది.  అయితే ప్రస్తుతం విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నారు లోకేష్‌. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. 

ఈ నేపథ్యంలో `ఖైదీ` సీక్వెల్‌పై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ డిటెయిల్స్ వెల్లడించారు కార్తి. ఆయన నటించిన `విరుమన్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నెక్ట్స్ ఇయర్‌ ప్రారంభంలో `ఖైదీ2` ప్రారంభమవుతుందని చెప్పారు కార్తి. ప్రస్తుతం విజయ్‌తో లోకేష్‌ ఓ సినిమా చేస్తున్నారని, అది పూర్తవగానే మా సినిమా ఉంటుందన్నారు. కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని కార్తి చెప్పడం విశేషం. 

ఈ లెక్కన `విక్రమ్‌ 2` సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉంటుందని చెప్పొచ్చు. ఇక కమల్‌ హాసన్‌ హీరోగా, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించిన `విక్రమ్‌` సినిమా జూన్‌ మొదటివారంలో విడుదలై సంచలన విజయం సాధించింది. సాధారణ టికెట్‌ రేట్లలోనూ ఈ చిత్రం నాలుగువందల కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్‌కి కొత్త ఊపుని తీసుకొచ్చింది. నిర్మాతలు కమల్‌కి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే