రిలీజ్ కు సిద్ధమైన ఆనంద్ దేవరకొండ ‘హైవే’.. ‘ఆహా’లో స్ట్రీమింగ్.. టీజర్ అదిరిందిగా..

By team teluguFirst Published Aug 9, 2022, 7:19 PM IST
Highlights

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), అభిషేక్ బెనర్జీ కలిసి నటించిన ‘హైవే’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.  
 

టాలీవుడ్ యంగ్ హీరో వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటు థియేట్రికల్ ఫిల్స్మ్ తో పాటు ఇటు ఓటీటీ కంటెంట్లతోనూ ఆడియెన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, రీసెంట్ గా ‘పుష్ఫక విమానం’ చిత్రాలతో అలరించిన ఆనంద్.. ప్రస్తుతం ఓటీటీ వేదికన మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. 

ఓటీటీ ప్రేక్షకులకు సరికొత్త కథలను అందించడంలో ‘ఆహా’ ఎప్పుడూ ముందుంటుంది. 4కే అల్ట్రా హెచ్ డీ, డాల్బీ ఆడియోతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆహ గోల్డ్ ఆఫర్ తో కొత్త అనుభూతిని పంచుతుంది.  ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ కలిసి నటించిన తాజా చిత్రం ‘హైవే’ (Highway)ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేశారు. ఈ మేరకు ఆహా సంస్థ సినిమాను ఈ నెల 19 (August 19) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు. 

ఈ చిత్రంలో సయామీ ఖేర్, మానస హీరోయిన్లుగా నటించారు. కే.వీ. గుహన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ రోజు ‘హైవే టీజర్’ను రిలీజ్ చేశారు.  కథ విషయానికివస్తే.. ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ 'డి' అనే పేరుతో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఎం జరుగుతుంది. విష్ణు తన తులసిని ఇన్స్పెక్టర్ ఆశ భారత్ (సయామీ ఖేర్) సాయంతో కాపాడుకోగల్గుతాడా? అనేది కథ. ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ ‘బేబీ’, ‘గం గం గణేశా’అనే చిత్రాల్లోనూ నటిస్తున్నారు. 

 

Some meetings leads to journeys…
Some journeys leads to disasters...
Presenting a nerve-wrenching psycho-thriller.
▶️ https://t.co/yl2Jg9j1w4 pic.twitter.com/itc4wYswh8

— ahavideoin (@ahavideoIN)
click me!