
ఫైనల్ గా అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ టీజర్ వచ్చేసింది. వివిధ భాషల్లో రూపొందుతున్న ఈ కథ మొదట ఏ బాషా నుంచి వస్తుందన్న ఎదురుచూపులకు దర్శకుడు సందీప్ వంగ క్లారిటి ఇచ్చేశాడు. అయితే టీజర్ ను చూస్తుంటే మేకింగ్ లో పెద్దగా మార్పులు చేయలేదని అర్ధమవుతోంది.
దాదాపు కథానాయకుడు షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండను దించేశాడు అని అర్ధమవుతోంది. ఇక కాంట్రవర్సీ డైలాగ్ కూడా అదే తరహాలో ప్రజెంట్ చేయడంతో బాలీవుడ్ జనాల్లో కూడా సినిమా చర్చనీయాశంగా మారుతోంది. మరి రికార్డుల్లో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ముందైతే టీజర్ ను చూసేయండి.