నటుడైన వర్మపై మెగాస్టార్ కామెంట్స్!

Published : Apr 08, 2019, 01:51 PM IST
నటుడైన వర్మపై మెగాస్టార్ కామెంట్స్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆదివారం నాడు తన పుట్టినరోజు సందర్భంగా 'కోబ్రా' సినిమాను తీస్తున్నట్లు ప్రకటించాడు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆదివారం నాడు తన పుట్టినరోజు సందర్భంగా 'కోబ్రా' సినిమాను తీస్తున్నట్లు ప్రకటించాడు. అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో వర్మ నటుడిగా మారుతున్నాడు.

తాజాగా సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. వర్మ ఓ చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్ పట్టుకొని కనిపించారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వర్మ చెప్పాడు. భారత నేర చరిత్రలోనే ఎప్పుడూ గుర్తించబడని అతి ప్రమాదకరమైన నేరస్థుడి బయోపిక్ ఇదని, నూతన నటుడు కేజీ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని చెప్పాడు. 

తను ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. 'కోబ్రా' పోస్టర్ చూసిన అమితాబ్ బచ్చన్ అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ పెట్టారు. ''చివరకి రామ్ గోపాల్ వర్మ తనలోని నటుడిని గుర్తించి, బయటకి తీశాడు. ఆల్ ది బెస్ట్ సర్కార్.. పోటీగా ఇంకొకరువచ్చారు'' అంటూ అమితాబ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం