డబుల్ సెంచరీతో షాకిచ్చిన కబీర్ సింగ్

Published : Jul 04, 2019, 12:19 PM ISTUpdated : Jul 04, 2019, 12:20 PM IST
డబుల్ సెంచరీతో షాకిచ్చిన కబీర్ సింగ్

సారాంశం

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై ఈ ఏడాది సల్మాన్ సినిమా భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎవరుఊహించని విధంగా కబీర్ సింగ్ 2019 కింగ్ గా నిలుస్తున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన షాహిద్ కపూర్ కబీర్ సింగ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.   

మొత్తానికి డబుల్ సెంచరీ కూడా కొట్టేసింది. 13 రోజుల్లోనే 200కోట్లను వసూలు చేసింది. అయితే సల్మాన్ భారత్ సినిమాకు మాత్రం అందుకు 14రోజుల సమయం పట్టింది. షాహిద్ కపూర్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ గ్రాసర్. 5రోజుల్లో 100కోట్లను కొల్లగొట్టిన కబీర్ సింగ్ ఆ తరువాత మరో 9 రోజుల్లో  వంద కోట్లను లాగేశాడు. 

ప్రస్తుతం ఈ బాక్స్ ఆఫీస్ లెక్కలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రేంజ్ లో సినిమా కలెక్షన్స్ సాదిస్తుందని ఎవరు ఉహించలేదట. ఈ సక్సెస్ తో హీరో షాహిద్ కపూర్ హీరోయిన్ కైరా అద్వానీ రెమ్యునరేషన్స్ పెంచినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సందీప్ వంగాను సైతం బాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ రెమ్యునరేషన్ తో ఆకర్షిస్తున్నట్లు టాక్.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం