బాలీవుడ్ కి షాక్ ఇచ్చిన కబీర్ సింగ్.. టార్గెట్ 200కోట్లు?

Published : Jun 28, 2019, 12:22 PM IST
బాలీవుడ్ కి షాక్ ఇచ్చిన కబీర్ సింగ్.. టార్గెట్ 200కోట్లు?

సారాంశం

సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కిన టాలీవుడ్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్  సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి దిమ్మ తిరిగే వసూళ్లతో అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఈ సినిమా కోసం 20 నుంచి 25కోట్ల వరకు చేయగా చాలా స్పీడ్ గా లాభాల్ని అందించింది.   

అయితే మొదటివారానికే సినిమా 100కోట్ల వసూళ్లతో నిర్మాతలకు కళ్లు చెదిరే వసూళ్లను గుమ్మరించింది/ బాలీవుడ్ లో చిన్న సినిమాలకు క్రేజ్ వస్తే దేశవ్యాప్తంగా కలెక్షన్స్ డోస్ పెరుగుతుంది. అదే తరహాలో కబీర్ సింగ్ కూడా క్లిక్కయ్యింది. ఇప్పటికే సినిమా 150కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక 200కోట్లను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. 

హీరోగ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న షాహిద్ బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకోవడం ఇదే మొదటిసారి. ఇక హీరోయిన్ కైరా అద్వానీ రేంజ్ కూడా మరింత పెరగడంతో అమ్మడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు సందీప్ వంగ నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లోనే తీసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా