Kaatera 4 Days Collections.. `కేజీఎఫ్‌`, `కాంతార` తర్వాత రికార్డు కలెక్షన్లు.. ఎంత చేసిందంటే?

Published : Jan 02, 2024, 08:30 PM ISTUpdated : Jan 02, 2024, 08:40 PM IST
Kaatera 4 Days Collections.. `కేజీఎఫ్‌`, `కాంతార` తర్వాత రికార్డు కలెక్షన్లు.. ఎంత చేసిందంటే?

సారాంశం

కన్నడ నాట `కాటేరా` సినిమా కలెక్షన్ల దుమ్మురేపుతుంది. దర్శన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు కి కొత్త కళ తీసుకొచ్చింది. హౌజ్‌ఫుల్‌తో రన్‌ అవుతుంది.

కన్నడ మూవీ `కాటేరా` ఇప్పుడు సంచలనంగా మారుతుంది. సైలెంట్‌గా థియేటర్లోకి వచ్చిన ఈమూవీ ఇప్పుడు దుమారం రేపుతుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతుంది. అంతా మాట్లాడుకునేలా చేస్తుంది. దర్శన్‌ హీరోగా నటించిన ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చాలా రోజుల తర్వాత మంచి ఫీల్‌గుడ్‌ మూవీ రావడంతో కన్నడ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 

ఈ మూవీ భారీ కలెక్షన్లని రాబడుతుంది. కన్నడనాట చాలా రోజుల తర్వాత థియేటర్లలో హౌజ్‌ఫుల్‌ బోర్డ్ లు కనిపిస్తున్నాయి. పలువురు ఎగ్జిబిటర్లు తమ హాల్‌లో నాలుగు రోజులుగా హౌజ్‌ఫుల్‌ నడుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఊహించినదానికంటే ఎక్కువగా కలెక్షన్లని రాబడుతుంది. థియేటర్లు కళకళలాడేలా చేస్తుంది. 

డిసెంబర్‌ 29న దర్శన్‌ `కాటేరా` సినిమా విడుదలైంది. టీజర్‌, ట్రైలర్లతో సినిమాకి మంచి హైప్ వచ్చింది. మంచి బిజినెస్‌ కూడా జరిగింది. దాదాపు యాభై కోట్ల బిజినెస్‌ జరిగిందని తెలుస్తుంది. ఇది దర్శన్‌ కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్‌ కావడం విశేషం. మంచి హైప్‌ తో విడుదలైన సినిమాకి అదే స్థాయిలో ఆడియెన్స్ రెస్పాన్స్ వస్తుంది. రోజు రోజుకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. 

ఈ మూవీ రెండు రోజుల్లోనే 35కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది. అక్కడ `సలార్‌`కలెక్షన్లని దాటేసింది. మూడో రోజు ఈ మూవీకి భారీగా వసూళ్లు వచ్చాయి. సుమారు 20కోట్ల గ్రాస్‌ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక నాల్గో రోజు సైతం దాదాపు పది కోట్ల షేర్‌ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మూవీ నాలుగు రోజుల్లో 77.6కోట్లు వసూలు చేసిందంటూ చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసింది. తొలి రోజు సుమారు 20కోట్లు(19.79), రెండో రోజులు 17.35కోట్లు, మూడో రోజు 20.94కోట్లు, నాల్గో రోజు 18.26కోట్లు రాబట్టిందని ప్రకటించారు. 

కానీ ఇవి ఫేక్‌ కలెక్షన్లు అని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. నిర్మాత రాక్‌ లైన్‌ వెంకేటేష్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన ఫేక్‌ కలెక్షన్లని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ ట్రోల్స్ ఆడుకుంటున్నారు. దీంతో నెట్టింట పెద్ద రచ్చ అవుతుంది. అయితే ఈ మూవీ `కేజీఎఫ్‌`, `కాంతార` తర్వాత మళ్లీ థియేటర్లు కళకళ లాడేలా చేస్తుందని కన్నడ వర్గాలు అంటున్నాయి. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది. కానీ ఈ మూవీ నాలుగు రోజుల్లో 38కోట్ల షేర్‌ రాబట్టిందని సమాచారం. 

దర్శన్‌, ఆరాధన రామ్‌ జంటగా నటించిన `కాటేరా` సినిమాలో జగపతిబాబు, కుమార్‌ గోవింద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించారు. రాక్‌ లైన్‌ వెంకటేష్‌ నిర్మించారు. వ్యవసాయం, రైతు చట్టాలపై యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామా మూవీగా తెరకెక్కిందీ చిత్రం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నిర్మాత కూతురి పెళ్లి వేడుకలో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్