58 ఏళ్ల వయస్సులో ఆమీర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం, మిస్టర్ పర్ఫెక్ట్ ఏం చేస్తున్నాడంటే..?

By Mahesh JujjuriFirst Published Jan 2, 2024, 6:12 PM IST
Highlights

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే.. ఎంత వయస్సు వచ్చినా.. ఆమీర్ ఖాన్ పేరే చెపుతారు. అంత ఫర్ఫెక్ట్ గా సినిమాలు చేస్తారు.. వ్యక్తిగత జీవితంలో కూడా అలానే ఉంటారు. ఇక అమీర్ ఖాన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అందరికి ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారంటే. 

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే.. ఎంత వయస్సు వచ్చినా.. ఆమీర్ ఖాన్ పేరే చెపుతారు. అంత ఫర్ఫెక్ట్ గా సినిమాలు చేస్తారు.. వ్యక్తిగత జీవితంలో కూడా అలానే ఉంటారు. ఇక అమీర్ ఖాన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం అందరికి ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారంటే. 

ప్రస్తుతం యాక్టింగ్ కు దూరంగా ఉన్నాడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో  ఆమిర్ ఖాన్. వరుసగా సినిమాలు  ప్లాప్ అవ్వడంతో.. కాస్త ఆలోచనలో పడ్డాడు ఆమిర్. ఆమధ్య ఆమీర్ చేసిన లాల్ సింగ్ చద్దా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఇకసినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను అని అనౌన్స్ చేశాడు. ఒక సారి ఇక హీరోగా నటించగను.. నిర్మాతగా సినిమాలు తీస్తాను అని కూడా అన్నట్టు టాక్. తను బ్రేక్ తీసుకోవడంతో వచ్చి న టైమ్ ను చాలా వరకూ తన పిల్లలతో గడిపేందుకు చూశాడు ఆమీర్. అంతే కాదు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ.. పుస్తకాలు చదువుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

Latest Videos

ఇక తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమీర్ ఖాన్  ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారట. షాకింగ్ గా ఉన్నా ఇది నిజం.  58 ఏళ్ల వయస్సులో కష్టపడి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట.   ఆమిర్‌ ఖాన్‌ సడెన్‌గా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కారణేమంటో తెలియడం లేదు. తన తదుపరి సినిమా కోసమే ఆయన క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకుంటున్నారని బాలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తోంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. 

గతంలోఆయనకు  మరాఠీ నేర్చుకోవాలి అనిపించింది. వెంటనే మొదలెట్టి కొద్ది రోజుల్లోనే ఆయన మరాఠీ ప్రాక్టీస్ చేసి  మాట్లాడాడు మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అనిపించుకున్నాడు. అలాగే ఖాళీ సమయంలో వంట చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు సంగీతంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రతిరోజూ ఒక గంట సంగీత సాధన కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం. అయితే దీని వెనక కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం ఆమీర్ ఖాన్ తన తల్లిని దగ్గరుండి చూసుకుంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ.. మొన్నటి వరకూ చున్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు అమీర్ తల్లిగారు. ఇక అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడంలో బిజీగా ఉంటున్నాడు. అలాగే తన కూతురు ఇరా ఖాన్ పెళ్లి పనులు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను ఇరా ఖాన్ పెళ్లి చేసుకోనుంది. ఈ వీక్ లోనే వీరి పెళ్ళి ఘనంగా జరగబోతోంది. ఇప్పిటికే ఆమీర్ ఖాన్ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. 


 

click me!