అనగనగా ఫిల్మ్ కంపెనీ ముక్కోణపు ప్రేమకథ!

Published : Feb 15, 2017, 08:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అనగనగా ఫిల్మ్ కంపెనీ ముక్కోణపు ప్రేమకథ!

సారాంశం

అనగనగా ఫిల్మ్ కంపెనీ బేనర్ పై ముక్కోణపు ప్రేమకథ ఇద్దరబ్బాయిలు ఒక అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథపై చిత్రం కాదలి పేరు ఖరారు చేసిన దర్శక నిర్మాతలు

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సలహాలతో అనగనగా ఫిల్మ్ కంపెనీ సంస్థ ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రానికి శ్రీకారం చుట్టింది.  పూజా.కె.దోషి హీరోయిన్‌గా , హరీష్ కల్యాణ్, సాయిరోనక్ హీరోలుగా నటిస్తున్న  ఈ చిత్రాన్ని  అనగనగా ఫిల్మ్ కంపెనీ పతాకంపై పట్టాబి.ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇదొక సింపుల్ లవ్‌స్టోరీ, ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిల మధ్య జరిగే ఈ ముక్కోణపు ప్రేమకథలో నేటి యువతరంతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి. ఇప్పటి వరకు ఎనభైశాతం షూటింగ్ పూర్తయింది.కొత్త పాత నటీనటుల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్తదనం ఆశించేవారికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

 

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్స్‌ను మూడు సార్లుగా ఈ 12, 13,14 తేదిలలో విడుదల చేసి, ప్రేమికుల దినోత్సవం రోజున చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫైనల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పూజా.కె.దోషి, హరీష్ కల్యాణ్, సాయిరోనక్, మోహన్మ్రన్, డా.మంజరి షర్మీల, సంధ్య జనక్, భాను అవిర్నేని, సుదర్శన్, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శేఖర్.వి.జోసెఫ్, సంగీతం: ప్రసన్న్, ప్రవీణ్, శ్యామ్, ఎడిటింగ్: మర్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రంగా, లైన్ ప్రొడ్యూసర్: పి.శ్రీనివాసరావు, రచన-దర్శకత్వం-నిర్మాత: పట్టాబి.ఆర్.చిలుకూరి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా