చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్“ఏంజెల్”

Published : Feb 15, 2017, 07:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్“ఏంజెల్”

సారాంశం

ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో “ఏంజెల్”  చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్“ఏంజెల్” 

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్. సోషియోఫాంటసీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో నిర్మాతగా భువన్ సాగర్, దర్శకుడిగా బాహుబలి పళని తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ఈ చిత్ర బృందం పూర్తి చేసుకొంది. తదుపరి షూటింగ్ ఫిబ్రవరి 14 నుంచి మొదలుకాబోతుంది.

 

ఇక సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్  అందిస్తున్నారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాహుబలి పళని సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా