ముగిసిన తరుణ్ సిట్ విచారణ, సహకరించానన్న తరుణ్

Published : Jul 23, 2017, 12:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ముగిసిన తరుణ్ సిట్ విచారణ, సహకరించానన్న తరుణ్

సారాంశం

13 గంటల  దాకా సాగిన తరుణ్ విచారణ సిట్ అడిగిన ప్రశ్నలకు తెలిసిన సమాధానం చెప్పానన్న తరుణ్ సినీ పరిశ్రమ కాక అంతటా నిర్మూలించడం అందరి బాద్యత-తరుణ్

సినీ నటుడు తరుణ్ సిట్ విచారణ ముగిసింది. డ్రగ్స్ స్కాండల్ లో పట్టుబడ్డ నిందితులతో గల సంబంధాలు, డ్రగ్స్ వినియోగంపై సిట్ తరుణ్ ను ప్రశ్నించింది. విచారణకు సహకరించానని అనంతరం తరుణ్ మీడియాతో చెప్పారు. 

డ్రగ్స్ ఒక్క సినీ పరిశ్రమనే కాక అంతటా విస్తరించిన సమస్య అని, దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి వుందని తరుణ్ అన్నారు. సిట్ విచారణలో తాను చెప్పిన సమాధానాలకు సిట్ సంతృప్తి చెందిందని భావిస్తున్నట్లు తరుణ్ చెప్పారు.

ఇక తరుణ్ సిట్ కు సహకరించారని, విచారణ సజావుగా సాగిందని అధికారులు తెలిపారు. తరుణ్ స్వచ్చందంగా తన గోర్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారని సిట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇక రేపు ఆదివారం కాబట్టి ఎల్లుండి నవదీప్ ను విచారిస్తామన్నారు. ఛార్మి కూడా విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపినట్లు సిట్ అధికారి శ్రీనివాసరావు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే