`బలగం` చిత్రం అరుదైన ఘనత.. ఏకంగా రెండు అంతర్జాతీయ అవార్డులు

Published : Mar 31, 2023, 04:13 PM ISTUpdated : Mar 31, 2023, 04:22 PM IST
`బలగం` చిత్రం అరుదైన ఘనత.. ఏకంగా రెండు అంతర్జాతీయ అవార్డులు

సారాంశం

మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన `బలగం` చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. 

టాలీవుడ్‌లో `బలగం` చిత్రం ఓ సంచలనంగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా, నోటెడ్‌ కాస్టింగ్‌ కూడా లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. `దాస్‌ కా ధమ్కీ` లాంటి చిత్రాలను వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. కేవలం రెండు కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా 25కోట్లు వసూలు చేయడం విశేషం. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కమెడియన్‌ వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. 

కమెడియన్‌ ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 3న విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుంది. భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాదు, అవార్డుల పరంగానూ సత్తా చాటుతుంది. ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. రెండు అంతర్జాతీయ పురస్కారాలు ఈ సినిమాకి వరించాయి. లాస్‌ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులని దక్కించుకుంది. బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

ఇందులో దర్శకుడు చెబుతూ, `నా `బలగం` సినిమాకు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరిస్తుంది. ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫి అవార్డును గెలుచుకున్నందుకు మా సినిమాటోగ్రాఫర్‌ ఆచార్య ఆచార్య వేణుకు అభినందనలు ` ట్వీట్‌ చేశాడు వేణు. దీనిపట్ల అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. అక్కడ కూడా విశేష ఆదరణ పొందుతుంది. 

తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. తాత చావు, కాకి ముట్టడం చుట్టూ కుటుంబ అనుబంధాలను చూపించారు దర్శకుడు వేణు. తెలంగాణ పల్లెని, కట్టుబొట్లని చూపించారు. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో వచ్చిన అచ్ఛమైన, స్వచ్ఛమైన తెలంగాణ సినిమా `బలగం`. స్వచ్ఛమైన భావోద్వేగాలను పంచిన చిత్రంగానూ ఇది నిలవడం విశేషం.  అందుకే దీనికి విశేష ఆదరణతోపాటు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు అవార్డులు పంట ప్రారంభమైంది. మున్ముందు ఇది మరిన్ని అవార్డులను సాధిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే