#NTR : సమంత ఆరోగ్యం పట్ల స్పందించిన జూ. ఎన్టీఆర్.. ఎమోషనల్ అయిన సెలబ్రెటీలు!

By team teluguFirst Published Oct 29, 2022, 6:46 PM IST
Highlights

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) అనారోగ్యానికి గురై అమెరికాలో చికిత్స పొందుతోంది. తాజాగా తను ఎలాంటి వ్యాధితో బాధపడుతోంది వివరించింది. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు.ఇప్పటికే సెలబ్రెటీలు కూడా ఎమోషనల్ అవుతున్నారు. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు. కొన్ని నెలల నుంచే చికిత్స పొందుతున్నా కోలుకునేందుకు ఇంకాస్తా సమయం పట్టేలా ఉంది. తాజాగా తను ఎలాంటి వ్యాధితో బాధపడుతుందో తెలియజేస్తూ సమంత ఎమోషనల్  కామెంట్స్ చేసింది. ‘నేను మైసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. కొన్ని నెలల క్రితమే చికిత్స కూడా జరిగింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ విషయం మీతో పంచుకోవాలనుకున్నా. త్వరగానే కోలుకుంటానని భావిస్తున్నాను. కానీ ఆసల్యం అవుతోంది. ప్రస్తుతం నేను నెమ్మదిగా కోలుకుంటున్నాను’ అంటూ భావోద్వేగమైన కామెంట్స్ చేసింది.

దీంతో సినీ  ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సమంత ఆరోగ్యం పట్ల స్పందిస్తున్నారు. సమంత తన ఆరోగ్య పరిస్థితి వివరించడంతో సెలెబ్రిటీలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రియాశరన్, రాశీఖన్నా, సుష్మిత కొణిదెల స్పీడ్ గా రికవరీ కావాలని ఆకాంక్షించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా స్పందించారు. ‘సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను’. అంటూ ట్వీటర్ ద్వారా భరోసా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సమంత తన ఆరోగ్యాన్ని వివరిస్తూ పెట్టిన పోస్టుకు కొద్ది గంటల్లో కోటీన్నర వరకు లైక్ లు వచ్చాయి. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కూడా కోరుకుంటున్నారు. ఇక సమంత నటించిన సై-ఫై చిత్రం ‘యశోద’ (Yashoda) నుంచి రీసెంట్ గా ట్రైలర్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇందుకు సమంత సోషల్ మీడియాలో  స్పందిస్తూ అందరికి కృతజ్ఞతలు చెప్పించింది. హరి శంకర్ - హరీష్ నారాయన్ దర్శత్వం వహిస్తున్న ‘యశోద’ చిత్రం వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Get well soon Sam. Sending you all the strength.

— Jr NTR (@tarak9999)
click me!