'హరిహర వీరమల్లు'లో క్రేజీ బాలీవుడ్ స్టార్.. అర్జున్ రాంపాల్ ఇక లేనట్లే ?

Published : Oct 29, 2022, 03:20 PM IST
'హరిహర వీరమల్లు'లో క్రేజీ బాలీవుడ్ స్టార్.. అర్జున్ రాంపాల్ ఇక లేనట్లే ?

సారాంశం

ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. భారీ సెట్స్, యాక్షన్స్ ఎపిసోడ్స్ తో క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు.. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకే నిర్ణయించుకున్నాడు. 

ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. భారీ సెట్స్, యాక్షన్స్ ఎపిసోడ్స్ తో క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మనసు పెట్టి నటిస్తుండడంతో ఫ్యాన్స్ బోలెడు అసలు పెట్టుకుని ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా దుమ్మురేపింది.

ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని ఎంచుకున్నారు. కానీ అతడు ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో క్రిష్ ఆ పాత్ర కోసం మరో బాలీవుడ్ క్రేజీ నటుడు బాబీ డియోల్ ని ఎంచుకున్నట్లు టాక్. 

అర్జున్ రాంపాల్ ప్లేస్ లో బాబీ డియోల్ ని తీసుకున్నారా లేక కొత్త పాత్ర కోసమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా హరిహర వీరమల్లు చిత్రంతో క్రిష్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు అనేది వాస్తవం. బాబీ డియోల్ ఓటిటి వేదికగా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. 

ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే బందిపోటుగా, దొంగగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి