జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు.. ఏమయ్యింది..?

By Mahesh Jujjuri  |  First Published Aug 14, 2024, 4:46 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిందా..? తారక్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని.. గాయం అయ్యిందని జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత..? 
 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగినట్టు.. ఆ ప్రమాదంలో ఆయన గాయపడ్డట్టు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. దాంత అభిమానులు ఆందోళలో పడ్డారు. అసలు తమ అభిమాన నటుడికి ఏమైయ్యి ఉంటుంది అని కంగారు పడ్డారు. ఎన్టీఆర్ కు ప్రమాదం అనేసరికి టాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. అయితే ఇందులో నిజా నిజాలు ఏంటనేది మాత్రం అఫిషియల్ గా తెలియ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. 

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందన్న వ్యాఖ్యలను ఖండించింది దేవర మూవీ యూనిట్. ఇందులో ఏమాత్రం నిజం లేదని టీమ్ వెల్లడించింది. ఆయన చేతికి స్వల్ప గాయం అయ్యిందని. అది కూడా  రెండు రోజుల క్రితం జిమ్‌ చేస్తుండగా చేతి మణికట్టుకు మాత్రమే గాయమైనట్లు తెలిపారు.  జూనియర్‌ ఎన్టీఆర్ గాయంతోనే సినిమా షూటింగ్‌లో  పాల్గొన్నట్లు సమాచారం. అంతే కాదు..  జూనియర్‌ ఎన్టీఆర్‌ గాయం కూడా మానిపోయినట్టు సమాచారం.

Latest Videos

 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు రూమర్లు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి.  అయితే దేవర టీమ్  మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ ఆయన జిమ్‌ చేస్తున్న సమయంలో మణికట్టుకు గాయమైనట్లు వివరణ ఇచ్చింది

ఇక ప్రస్తుతం ఆయన దేవర మూవీ ఫైనల్ షూట్ ను కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసినట్టు సమాచారం. నిన్న షూటింగ్ కు సబంధించిన ఫోటోన కూడా పంచుకున్నారు తారక్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 

click me!