నా డైమండ్‌ చెవిపోగు పోయింది..ఎవరైనా హెల్ప్‌ చేయండిః జూహీ చావ్లా

Published : Dec 14, 2020, 10:51 AM IST
నా డైమండ్‌ చెవిపోగు పోయింది..ఎవరైనా హెల్ప్‌ చేయండిః జూహీ చావ్లా

సారాంశం

గత 15ఏళ్లుగా ఆ డైమండ్‌ రింగ్‌ని ధరిస్తున్నట్టు తెలిపింది. దయజేసి నా వజ్రపు చెవి పోగు దొరికితే పోలీసులకు లేదా తనకు చెప్పండ`ని పేర్కొంది. ఈ సందర్భంగా అభివాదం చేసే ఎమోజీలను పంచుకుంది. తన మ్యాచింగ్ ఇయరింగ్ స్నాప్ షాట్ ను ను నెటిజన్లతో పంచుకున్నారు. 

బాలీవుడ్‌ సీనియర్‌ నటి జూహీచావ్లా చెవిపోగో పోగొట్టుకుంది. అది మామూలు చెవిపోగు కాదు. ఏకంగా డైమండ్‌ చెవిపోగునే పోగోట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని జూహీ చావ్లా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ప్లీజ్‌ హెల్ప్‌ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు దాని ఫోటోని పంచుకుంది. ఆమె చెబుతూ, నేను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో టీ 2 నుంచి గేట్‌ 8 వైపు నడుస్తుండగా, నా వజ్రాల చెవిపోగు జారి పడిపోయింది. నాకు ఎమిరేట్స్ కౌంటర్‌, సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్‌ వద్ద తనిఖీ చేశారు. ఆ సమయంలో అది కనిపించకుండాపోయింది. దయజేసి నా చెవిపోగు కనుగొనడంలో ఎవరైనా సహాయం చేయగలిగితే వారికి బహుమతి ఇస్తాన`ని తెలిపింది. 

గత 15ఏళ్లుగా ఆ డైమండ్‌ రింగ్‌ని ధరిస్తున్నట్టు తెలిపింది. దయజేసి నా వజ్రపు చెవి పోగు దొరికితే పోలీసులకు లేదా తనకు చెప్పండ`ని పేర్కొంది. ఈ సందర్భంగా అభివాదం చేసే ఎమోజీలను పంచుకుంది. తన మ్యాచింగ్ ఇయరింగ్ స్నాప్ షాట్ ను ను నెటిజన్లతో పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ అధికారులతోపాటు నెటిజన్లు దాన్ని కనిపెట్టే పనిలో బిజీ అయ్యారు. మరి ఈ డైమండ్‌ చెవిపోగు దొరుకుతుందేమో చూడాలి. 

ఇదిలా ఉంటూ మూడు రోజుల క్రితమే జూహ్లీ హరిద్వార్‌కి వెళ్లింది. ఈ సందర్భంగా ఓ వీడియోని ట్విట్టర్‌లో పంచుకుంది. బహుశా ఆ సమయంలోనే జూహీ తన డైమండ్‌ రింగ్‌ని కోల్పోయి ఉంటుంది. జూహీ చావ్లా `ప్రేమలోక`, `సుల్తానట్‌`, `హమ్‌ హై రహి ప్యార్‌ కే`, `లూటేఫర్‌`, `హైనా`, `డర్ర్‌`, `రామ్‌ జానే`, `దీవానా మస్తానా`, `యెస్‌ బాస్‌` `ఇష్క్`, `అర్జున్‌ పండిట్‌` వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళం, పంజాబీ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో `విక్కీ దాదా`, `శాంతి క్రాంతి`, `కళియుగ కర్ణుడు` చిత్రాల్లో నటించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు