`డర్టీహరి` పోస్టర్‌ వివాదం.. నిర్మాత గూడురు శివరామకృష్ణపై కేసు నమోదు..

Published : Dec 14, 2020, 10:07 AM IST
`డర్టీహరి` పోస్టర్‌ వివాదం.. నిర్మాత గూడురు శివరామకృష్ణపై కేసు నమోదు..

సారాంశం

 `డర్టీ హరి` చిత్ర నిర్మాత గూడూరు శివరామకృష్ణపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పై అతికించిన సినీ పోస్టర్లపై కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ చిత్ర పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని, యువతని తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపారు. 

అడల్డ్ కంటెంట్‌తో వస్తోన్న `డర్టీ హరి` చిత్ర నిర్మాత గూడూరు శివరామకృష్ణపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పై అతికించిన సినీ పోస్టర్లపై కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ చిత్ర పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని, యువతని తప్పుదోవ పట్టించేలా ఉందని, చిత్ర నిర్మాత గూడూరు శివరామకృష్ణపై, అలాగే పబ్లిషింగ్‌ ఏజెన్సీలపై సుమోటో కేసు నమోదు చేశామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. 

ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర పోస్టర్స్, టీజర్‌ చూస్తుంటే అడల్ట్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందుతుందని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ద్వారా ఎలాంటి సందేశం అందిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇందులో శ్రావణ్‌ రెడ్డి, రుహాని శర్మ జంటగా నటించారు. హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌పీజే క్రియేషన్స్ పతాకాలపై సినిమా రూపొందుతుంది. గూడూరు శివరామకృష్ణ నిర్మాత. ఇది ఈ నెల 18న ఫ్రైడేమూవీ ఏటీటీలో విడుదల కాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు