
నటుడిగా, రాజకీయనాయకుడిగా సీనియర్ ఎన్టీఆర్ తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. తెలుగు జాతిని ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అలాంటి మహానుభావుడి బాయోపిక్ ను తెరక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రోజుకో న్యూస్ ఎదో ఒకటి వైరల్ అవుతుందే ఉంది.
ఇక ఇప్పుడు కొత్తగా మరో షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. బయోపిక్ కోసం దర్శకుడు క్రిష్ దాదాపు అన్ని పాత్రలను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తాడా లేదా అని అందరిలో మొదటి నుంచి ఆసక్తి ఉంది. కానీ తారక్ లేనట్లే అనే వార్తలు ఎక్కువగా వచ్చాయి.
కానీ ఇప్పుడు అందుతోన్న సమాచారం ప్రకారం తారక్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని టాక్. అదికూడా బాలకృష్ణ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి హీరోలందరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. బాలకృష్ణ తారక్ తో ఎక్కువగా కనిపిస్తుండడం అలాగే అరవింద సక్సెస్ మీట్ కు రానుండడం అభిమానులకు సంతోషాన్నిచ్చే అంశాలు.
ఇక ఇప్పుడు ఆయన పాత్రలోనే కనిపిస్తారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలకృష్ణ తనతండ్రి పాత్రలో కొన్ని విభిన్నమైన గెటప్స్ లలో కనిపిస్తారు. ఇక బాలకృష్ణ యువకుడి పాత్రను మొదటగా ఆయన కొడుకు మోక్షాజ్ఞ వేస్తాడని టాక్ వచ్చింది.
అయితే మోక్షాజ్ఞ డైరెక్ట్ గా సోలో హీరోగా ఎంట్రీ ఇప్పించాలని నిర్ణయాన్ని మార్చుకున్నారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను ఫిక్స్ చేశారట. అదే విధంగా తారక్ ను బాలయ్య పాత్రలో చూపిస్తే సినిమా స్థాయి పెరుగుతుందని కూడా చిత్ర యూనిట్ ప్లాన్ వేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిటే సమాధానమివ్వాలి.