అమిత్ షాతో భేటీపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, ఏమన్నారంటే..?

By Mahesh JujjuriFirst Published Aug 22, 2022, 7:48 AM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ... టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయంలో స్పందించారు ఎన్టీఆర్. అమిత్ షాను కలవడం గురించి ఓ ట్వీట్ చేశారు. అది కూడా అమిత్ షా ట్వీట్ కు రిప్లైగా.. రీ ట్వీట్ చేశారు యంగ్ టైగర్. 

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సెంట్రల్ హోమ్ మినిష్టర్ అమిత్ షా  కలవడం.. డిన్నర్ కు ఆహ్వానించడం..దేశ వ్యాప్తంగా పెద్దా చెర్చకు దారి తీస్తుంది. అసలు ఎందుకు వీరు కలిసుంటారా అన్న ఆలోచన అటు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో అంతుపట్టలేకుంది. అయితే ట్రిపుల్ ఆర్ మూవీ చూసిన అమిత్ షా..ఎన్టీఆర్ నటనకు ముగ్థులయ్యారని.. అందుకే అభినందించడానికి పిలిచి ఉంటారని కొందరంటుంటే.. తారక్ ను బిజేపీలోకి ఆహ్వానించడానికే అని మరికొందరంటున్నారు. ఈ క్రమంలో అమిత్ షాను కలవడంపై ఎన్టీఆర్ స్పందించారు. 

అయితే ముందుగా అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడం గురించి ఓ ట్వీట్ చేశారు.. ట్విట్టర్ లో హోమ్ మినిష్టర్ ఇలా రాశారు... అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉంది.. అంటూ అమిత్‌షా ట్వీట్‌ చేశారు.  ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ట్వీట్ ను చేశారు. 

 

It was a pleasure meeting you and having a delightful interaction ji. Thanks for the kind words. https://t.co/Hrn33EuRJh

— Jr NTR (@tarak9999)

 

అమిత్ షా ఎన్టీఆర్ గురించి చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు. ఈ విధంగా ట్వీట్ చేశారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అమిత్ షా జీ. మీరు నాగురించి మాట్లాడిన మాటలకు ధన్యవాదాలు అంటూ తారక్ రిప్లై ఇచ్చారు. అమిత్ షా ట్వీట్ ను కూడా ఆయన శేర్ చేశారు. మొత్తానికి తారక్ ను హోమ్ మినిష్టర్ కలవడం వెనకు ఏదో ఒక పెద్ద కారణం ఉంది అని అనుకుంటున్నారు విశ్లేషకులు. కాని  బీజేపి వాదన మాత్రం మరోలా ఉంది.

వీరి భేటి జరిగిన  కొంతసేపటి తర్వాత నోవాటెల్‌ నుంచి బయటికి వచ్చిన తెలంగాణ BJP చీఫ్ బండి సంజయ్‌ వారి మీటింగ్ పై మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అద్భుత నటన  ప్రదర్శించిన ఎన్టీఆర్‌ను అభినందించేందుకే ఈ భేటీ జరిగిందని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నోవాటెల్‌ హోటల్‌లో అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయ్యారు. కొంతసేపు వారు మాట్లాడుకున్నారు. కలిసి భోజనం చేశారు. సుమారుగా  11.10 గంటలకు  జూనియర్‌ ఎన్టీఆర్‌ హోటల్  నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

click me!