వీడియోకాల్ లో చలపతిరావు చివరిచూపు చూసిన జూనియర్ ఎన్టీఆర్, ఎందుకు రాలేకపోయారు

Published : Dec 25, 2022, 12:23 PM ISTUpdated : Dec 25, 2022, 12:27 PM IST
వీడియోకాల్ లో చలపతిరావు చివరిచూపు చూసిన జూనియర్ ఎన్టీఆర్, ఎందుకు రాలేకపోయారు

సారాంశం

చలపతిరావు మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తెలుగు పరిశ్రమ స్టార్స్ అంతా వరుసగా సంతాపాలు ప్రకటిస్తున్నారు. ఈక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా చలపతిరావు ను చివరి చూపులు చూసుకున్నారు. 

దిగ్గజ నటుడు చలపతిరావు మరణ వార్తతో టాలీవుడ్‌లో తీవ్ర  విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యాక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఈక్రమంలో చలపతిరావు మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిచడం తో పాటు.. వీడియో కాల్ లో ఆయన్ను చివరి చూపు చూసుకున్నారు. 

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ చలపతిరావు మృతితో దిగ్బ్రాంతి వ్యాక్తం చేశారు. వీడియో కాల్ ద్వారా అక్కడి నుంచి చలపతిరావును చివరి చూపు చూసుకున్నారు. ఆయన కుమారుడు ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబుకు ధైర్యం చెప్పారు.  నందమూరి కుటుంబానికి ముఖ్యంగా ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ తో చలపతిరావుకు మంచి అనుబంధం ఉంది. చలపతిరావు ను తారక్ బాబాయ్, చలపతి బాబాయ్ అంటూ పిలిచేవారు. ఎన్నో సినిమాల్లో వీరు కలిసి పనిచేశారు. నందమూరి కుటుంబానికి సొంత మనిషిలా మెలిగారు చలపతిరావు. 

 

ఎన్టీఆర్ వల్లే చలపతిరావు సినిమల్లోకి వచ్చారు. ఆయన సినిమాల్లో పక్కాగా చలపతికి ఒక పాత్ర ఉండేది. ఎన్టీఆర్ గురించి కూడా ప్రతీ ఇంటర్వ్యూలో చెపుతుంటారు చలపతి రావు. ఇక బోయపాటి శ్రీనుతో కూడా చలపతిరావు కు మంచి అనుబంధం ఉంది. ఆరోగ్యం బాగోలేక పోయినా..స్పషల్ ప్లైట్ లో చలపతిని తీసుకువెళ్ళి షూటింగ్ చేసుకున్నారు బోయపాటి. ఇలా చలపతిరావు తో నందమూరి కుటుంబానిది ప్రత్యేక అనుబంధం. 

 

అటు ఎన్టీఆర్, బాలయ్య, కల్యాన్ రామ్ చలపతిరావు మరణానికి సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం చలపతిరావు మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’ అంటూ తారక్ సంతాపం వ్యక్తం చేశారు.

 

చలపతిరావు మరణం పట్ల నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ‘చలపతిరావు బాబాయి అంటే నాకు ఒక వ్యక్తిగా, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. అతని ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నష్టాన్ని పదాలు వివరించలేవు. అతని కుటుంబానికి ఈ బాధను అధిగమించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారు.


 

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే