తెలంగాణలో అమిత్ షా పర్యటన.. షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..!

Published : Aug 21, 2022, 12:41 PM ISTUpdated : Aug 21, 2022, 12:57 PM IST
తెలంగాణలో అమిత్ షా పర్యటన.. షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..!

సారాంశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వస్తున్న అమిత్ షా.. వ్యుహాత్మకంగా ఇక్కడ వివిధ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసుకున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వస్తున్న అమిత్ షా.. వ్యుహాత్మకంగా ఇక్కడ వివిధ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసుకున్నారు. తెలంగాణకు వస్తున్న అమిత్ షాను కలిసేందుకు రావాల్సిందిగా ప్రముఖ సినీ నటడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. అమిత్ షాతో విందు రావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్‌కు షా కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టుగా చెబుతున్నారు. 

ఈ క్రమంలోనే అమిత్ షాను ఎన్టీఆర్ కలవనున్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈరోజు సాయంత్రం నోవాటెల్‌ హోటల్‌లో అమిత్‌షాను  జూనియర్‌ ఎన్టీఆర్‌ కలవనున్నారు. ‘‘ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాను కేంద్ర మంత్రి అమిత్‌ షా  చూశారు. అందులో ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. దీంతో ఎన్టీఆర్‌తో మాట్లాడాలని అమిత్‌షా నిర్ణయించుకున్నారు’’ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే భేటీ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారిద్దరు ఏ అంశాలు చర్చించనున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?